హైద్రాబాద్ ఉప్పల్‌లో భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్: స్టేడియంలోకి ఇవి తీసుకెళ్లడం నిషేధం

హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో  భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య  తొలి టెస్ట్ మ్యాచ్ ను పురస్కరించుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

IND vs England 1st test match:Tight security blanket for Test match at Rajiv Gandhi Stadium; check banned items list lns

హైదరాబాద్: హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో  ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య  ఈ నెల  25వ తేదీన మొదటి టెస్ట్  ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో  306 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను  హైద్రాబాద్ కమాండ్ కంట్రొల్ సెంటర్ తో  అనుసంధానం చేసినట్టుగా తెలిపారు.

ఇంగ్లాండ్, భారత క్రికెట్ జట్ల మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్  కోసం  1500 పోలీసులతో పాటు అక్టోపస్, స్పెషల్ పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తారు.  ఉప్పల్ స్టేడియంలో  క్రికెట్ మ్యాచ్ ను తిలకించేందుకు వచ్చే మహిళల కోసం ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.  100 షీ టీమ్స్ కూడ  రంగంలోకి దించారు పోలీసులు. 

also read:భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్: హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ ట్రాక్ రికార్డు ఇదీ..

ఈ నెల  25వ తేదీన ఉదయం 9 గంటల కు  మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే  ఈ మ్యాచ్ ను తిలకించేందుకు గాను  ప్రేక్షకులను ఉదయం ఆరు గంటల నుండి అనుమతిస్తారు.మొబైల్స్ పవర్ బ్యాంక్స్,  సిగరెట్లు, ల్యాప్ ట్యాప్ లు, లైటర్లు, బ్యాగ్స్, బైనాక్యూలర్స్ ఎలక్ట్రానిక్స్ పరికరాలను  అనుమతించబోమని  పోలీసులు ప్రకటించారు.పెన్నులు, కాయిన్లు,బ్యాటరీలు,హెల్మెట్లు, ఫెర్ ఫ్యూమ్స్, బయటి తినుబండారాలు తీసుకు రావొద్దని  రాచకొండ పోలీసులు తేల్చి చెప్పారు.

భారత్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ నేపథ్యంలో  ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉప్పల్ వైపు వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలను కంట్రోల్ చేసేందుకు  సుమారు  200 మంది ట్రాఫిక్ సిబ్బందికి విధులు కేటాయించారు.  ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ తిలకించేందుకు వచ్చే ప్రేక్షకుల వాహనాల పార్కింగ్ కోసం  15 ప్రాంతాలను ఏర్పాటు చేశారు. నిర్ధేశించిన స్థలాల్లోనే  వాహనాల పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios