హైద్రాబాద్‌లో ఐటీ సోదాలు: ఏకకాలంలో 10 చోట్ల ఐటీ అధికారులు దాడులు
హైద్రాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఐటీ శాఖాధికారులు శుక్రవారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు సంస్థలపై ఐటీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు.
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నాడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ లోని పలు సంస్థల్లో ఆదాయపన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
నగరంలోని కూకట్ పల్లి, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్ సహా 10 చోట్ల ఏక కాలంలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఏస్టేట్ , వ్యాపార సంస్థల్లో ఐటీ అధికారులు చేస్తున్నారు. రియల్ ఏస్టేట్ సంస్థలు నిర్వహిస్తున్న యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు నిర్వహిస్తున్నారు.గతంలో రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.హైద్రాబాద్ నగరంలోని ప్రముఖ మొబైల్ షాపుల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
గతంలో నిర్వహించిన సోదాలకు కొనసాగింపుగా ఇవాళ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైద్రాబాద్ నగరంలోని కూకట్ పల్లితో పాటు మరికొన్ని చోట్ల కొన్ని సంస్థలు కలిపి భారీ పెట్టుబడి పెట్టినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. షెల్ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టినట్టుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అధికారులు సోదాలు చేస్తున్నారు.
రియల్ ఏస్టేట్ రంగంలో ఓ ప్రముఖ బట్టల సంస్థ పెట్టుబడులు పెట్టిందని ఐటీ అధికారులు గుర్తించారు. కూకట్ పల్లిలోని ఓ ల్యాండ్ వివాదాల్లో ఈ సంస్థ జోక్యం చేసుకుంది. అంతేకాదు ఇతర సంస్థలతో కలిపి ప్రముఖ బట్టల సంస్థ వ్యాపారం చేస్తుంది. నగరంలోని గతంలో రియల్ ఏస్టేట్ సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఇవాళ ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని సమాచారం.