రాజ్ పుష్ప, ముప్పా  సంస్థల్లో  ఐటీ సోదాలు  ఇవాళ ముగిశాయి.   బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి  నివాసం, ఆయన  కార్యాలయాల్లో  కూడా  ఐటీ అధికారులు  సోదాలు  చేసిన విషయం తెలిసిందే.  

హైదరాబాద్: నగరంలోని రాజ్ పుష్ప, ముప్పాలలో ఐటీ సోదాలు సోమవారం నాడు ముగిశాయి. ఆరు రోజుల పాటు ఆదాయపన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. ఈ రెండు సంస్థలతో పాటు వెర్టిక్స్, వసుధ పార్మాలలో కూడ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ రెండు సంస్థల్లో నాలుగు రోజుల పాటు పాటు సోదాలు జరిగాయి.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ సంస్థల్లో నిర్వహించిన సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను ఆదాయ పన్ను శాఖాధికారులు సీజ్ చేశారు. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా ఐటీ అధికారులు విచారించినట్టుగా సమాచారం.