హైదరాబాద్‌: నగరంలోని యశోద ఆసుపత్రుల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు  మంగళవారం నాడు తనిఖీలు చేపట్టారు. 

ఇవాళ ఉదయం నుంచి 20కి పైగా బృందాలు ఆసుపత్రులతో పాటు పలువురి వైద్యుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నాయి. 

ఆదాయపన్ను చెల్లింపుల్లో తేడా ఉన్నట్టు ప్రాథమికంగా ఐటీశాఖ  గుర్తించింది. ఈనేపథ్యంలో ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్టు సమాచారం. సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశముంది.

ఏకకాలంలోనే యశోద ఆసుపత్రులపై ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  ఈ సోదాల్లో అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా సమాచారం. ఈ విషయమై ఐటీ శాఖాధికారులు స్పందించే అవకాశం ఉంది.