Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొక్క‌జొన్న గింజ‌లు తింటూ మూడేండ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీంతో బాధిత కుంటంబ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గింజ‌లు తింటూ చిన్నారి ప్రాణాలు కోల్పోవ‌డంతో గ్రామంలోనూ విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.  

Baby Girl Died Due to maize seeds Stuck in Lungs: ఓ మూడేండ్ల చిన్నారి ఆహారం తీసుకుంటుండ‌గా గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. మొక్క‌జొన్న గింజ‌లు తింటూ మూడేండ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీంతో బాధిత కుంటంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గింజ‌లు తింటూ చిన్నారి ప్రాణాలు కోల్పోవ‌డంతో గ్రామంలోనూ విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం రాంపురంలో మూడేండ్ల చిన్నారి బిందు శ్రీ మొక్క‌జోన్న గింజ‌లు తింటుండ‌గా, గొంతులో ఇరుకుని ప్రాణాలు కోల్పోయింది. మొక్క జోన్న గింజలు ఊపిరితిత్తుల్లోకి గాలివెళ్ల‌డ‌కుండా అడ్డంగా ఇరుక్కుపోయాయి. దీంతో చిన్నారి ఊపిరి తీసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డింది. అయితే, అక్క‌డే ఉన్న త‌ల్లిదండ్రులు చిన్నారిని కాపాడేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ ఫ‌లితం లేకుండా పోయింది. గింగ‌జలు ఊపిరి తీసుకోవ‌డానికి అడ్డుగా ఉండ‌టంతో ప్రాణాలు కోల్పోయింది. 

త‌మ క‌ళ్ల ముంద‌రే ఊపిరి తీసుకోవ‌డంలో ఇబ్బందులు ప‌డుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోవ‌డంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇలా గింజ‌లు తింటూ బాలిక ప్రాణాలు కోల్పోయిన ఘటనతో రాంపురంలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి. చిన్నారిని కోల్పోయిన ఆ కుటుంబ రోద‌న‌లు అంద‌రినీ క‌ల‌చివేస్తున్నాయి. కాగా, కొన్ని రోజుల క్రితం వ‌ర‌గంల్ లోనూ ఇలాంటి ఘ‌ట‌న చోటుచేసుకుంది. సందీప్ సింగ్ అనే బాలుడు చాక్లెట్ తింటుండ‌గా, అది గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస తీసుకోకుండా అడ్డుప‌డింది. ఈ క్ర‌మంలోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారుల విష‌యంలో త‌ల్లిదండ్రులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌నీ, వారు ఏం తింటున్నారు? ఏం చేస్తున్నార‌నే దానిపై ఓ క‌న్నేసి ఉంచాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.