రెడ్ అలెర్ట్ ఉప సంహరణ: తెలంగాణలో ఎల్లో అలెర్ట్ జారీ, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్

తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ ను ఉపసంహరించారు. ఎల్లో అలెర్ట్  కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు.ఈ నెల 26న జగిత్యాల, కరీంనగర్,పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

IMD issues yellow alert in Hyderabad


హైదరాబాద్: Telangana  రాష్ట్రంలోని పలు జిల్లాలకు Red అలెర్ట్ ను వాతావరణ శాఖ ఉపసంహరించుకొంది. అయితే Yellow Alert మాత్రం కొనసాగుతుందని వాతావరణశాఖాధికారులు ప్రకటించారు. ఈ నెల 26న తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు.

ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ మీదుగా ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తూనే వర్షాలను మోసుకొచ్చాయి. అయితే మధ్యలో కొన్ని రోజులు వర్షాలు  విరామం ఇచ్చాయి. మరో వైపు గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. Godavari పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు వర్షం వస్తే వణికిపోతున్నారు. గత 100 ఏళ్లలో రాని వరద గోదావరి నదికి పోటెత్తింది. దీంతో  బద్రాచలం వద్ద గోదావరి నది 70 అడుగులు దాటి ప్రవహించింది. Adilabad జిల్లా నుండి Andhra Pradesh రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు గోదావరికి వచ్చిన వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

ఈనెల 26న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.. మరో వైపు  ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. 

రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సీఎం KCR  శనివారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదులకు వరదలు పోటెత్తడంతో ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధలులు కూడా ఆయా జిల్లాల్లోనే ఉంటూ  వరదలు, వర్షాల పరిస్థితిని పరిశీలించాలని సీఎం కోరారు.

also read:Telangana Rains: మరో నెల రోజులు సమృద్దిగా వానలు.. రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్

తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ ను ఉపసంహరించినా కూడా ఎల్లో అలెర్ట్ జారీ చేయడంతో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు నీటితో కలకలలాడుతున్నాయి. ఈ తరుణంలో వచ్చే వరదను దిగువకు విడుదల చేయనున్నారు. దీంతో ప్రాజెక్టుల దిగువన నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరో వైపు ముంపునకు గురయ్యే  ప్రాంతాల ప్రజల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios