Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం... వివాహితతో ఓసారి, ఒంటరిగా రెండోసారి యువకుడి ఆత్మహత్య

వివాహితతో కలిసి ఓసారి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించి ప్రాణాలతో బయటపడినా మరోసారి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది. 

illegal affair... young Boy commits suicide over failed love
Author
Mahabubnagar, First Published Nov 9, 2021, 4:56 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మహబూబ్ నగర్: వివాహేతర సంబంధాన్ని కలిగిన యువతితో కలిసి అతడు ఓసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వివాహిత చనిపోగా అతడు మాత్రం బ్రతికాడు. అయితే ప్రియురాలి మృతిని తట్టుకోలేకపోయిన అతడు తాజాగా మరోసారి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... mahabubnagar district దేవరకద్ర మండలం గోపన్ పల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులుకు ఎక్లాపూర్ గ్రామానికి చెందిన మహిళతో కొన్నేళ్లక్రితం వివాహమైంది. అయితే పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా వీరికి సంతానం కలగకపోవడంతో భార్య అంగీకారంతోనే ఆమె చెల్లి అక్షిత(25) ను ఆంజనేయులు పెళ్లాడాడు. వీరికి మూడేళ్ల కొడుకు వుండగా అక్షిత ఏడు నెలల గర్భిణి. 

అయితే అదే గ్రామానికి చెందిన మధు(20) అనే యువకుడితో అక్షితకు పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతరసంబంధానికి దారితీసింది. అయితే ఏమయ్యిందో తెలీదుగానీ గత నెల(అక్టోబర్) చివర్లో మధు, అక్షిత ఒకేగదిలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.వీరిని గమనించిన కుటుంబసభ్యులు ఇద్దరినీ కాపాడి కొనఊపిరితో వున్న వారిని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ అక్షిత ప్రాణాలు కోల్పోయింది.  

read  more  వివాహేతర సంబంధం : భర్త వద్దన్నాడని, పక్కా ప్లాన్ తో.. పత్తిచేలోకి తీసుకెళ్లి...

మధు మాత్రం కొన్నిరోజుల చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన అతడిని కుటుంబసభ్యులు అడ్డాకుల మండలం గుడిబండలోని పెద్దమ్మ జయమ్మ ఇంట్లో వుంచారు. అయితే  ప్రియురాలి జ్ఞాపకాలతో తీవ్ర డిప్రెషన్ కు లోనయిన మధు మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటిముందున్న చెట్టుకు అర్ధరాత్రి ఉరేసుకోగా తెల్లవారుజామున అతడి పెద్దమ్మ గుర్తించింది. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. 

వెంటనే మధు తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకుదించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యపై కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.  ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. 

వివాహేతర సంబంధం... ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

సంగారెడ్డి జిల్లా మోమిన్ పేట్ మండలంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ కసాయి భార్య. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన మహిళతో మోమిన్ పేట్ మండలానికి చెందిన శివశంకర్ వివాహమాడాడు. వారికి ముగ్గురు సంతానం. అయితే సంవత్సరం క్రితం ఆమె భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. 

ఆ సమయంలో సంగారెడ్డికి చెందిన జహంగీర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా Extramarital affairకి దారి తీసింది. ఇటీవల మళ్లీ ఆమె భర్త దగ్గరకు రావడంతో జహంగీర్ శివశంకర్ తో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి Alcohol తాగేవారు. ఇటీవల మళ్లీ శివశంకర్ భార్యను వేధిస్తుండటంతో ప్రియుడు, ఆమె కలిసి అతడిని అంతమొందించాలని పథకం పన్నారు. మాయమాటలతో జహంగీర్ అతడిని మంగళవారం మైతాప్ ఖాన్ గూడకు తీసుకునివెళ్లి మద్యం తాగించాడు. 

read more  పక్కింటి వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం... తట్టుకోలేక ఆ భర్త చేసిన పని...

తాగిన మైకంలో ఉన్న అతడిపై రాళ్లతో దాడి చేసి Murderకు ప్రయత్నించాడు. తీవ్రగాయాల పాలైన శివశంకర్ రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందాడు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు మృతుడి భార్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.  

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios