Hyderabad: ఓటరు నమోదుకు www.voters.eci.gov.in  వెబ్ సైట్ లో లాగిన్ కావడంతో ఆన్ లైన్  దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఓటర్ హెల్ప్ లైన్ (voter helpline app) యాప్  ను డౌన్ లోడ్ చేసుకొని ఫారం-6 లో పూర్తి వివరాల తో సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. 

Telangana Assembly Election: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌ల సమ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ఎన్నిక‌ల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా మ‌రోసారి త‌మ ఓట‌ర్ గుర్తింపుల‌ను చెక్ చేసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించింది. ఒకవేళ పేరు గ‌న‌క మిస్సైతే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. అయితే, కొత్త‌వారు కూడా ఓట‌ర్ ఐడీ గుర్తింపు కోసం ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని తెలిపింది.

వివ‌రాల్లోకెళ్తే.. 18 సంవత్సరాల వయస్సు నిండిన, ఆ పై వయస్సు గల వారు ఓటరు జాబితాలో పేరు లేని పక్షంలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. 18 సంవత్సరాల వయస్సు దాటిన వారికి ఓటరుగా నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఓటరు నమోదుకు www.voters.eci.gov.in వెబ్ సైట్ లో లాగిన్ కావడంతో ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఓటర్ హెల్ప్ లైన్ (voter helpline app) యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఫారం-6 లో పూర్తి వివరాల తో సంబంధిత ధ్రువీకరణ పత్రాలను తమకు అందించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.

అక్టోబర్ 1, 2023 అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాలు వయస్సు పూర్తయ్యే వారు ముందస్తు గా ఓటరుగా నమోదు చేసుకోవవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ చెప్పారు. పూర్తి వివరాలకు ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్ 1950 కు సంప్రదించవచ్చని వెల్ల‌డించారు. ఓటర్ల జాబితాలోని పేర్లలో అక్షర దోషాలు, ఫోటో పొంతన లేకపోవడం, ఇంటి నంబర్లు, చిరునామాలు, పుట్టిన తేదీలు, లింగాలు, మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్లు, కుటుంబ సభ్యుల పేర్లు వంటి సంబంధిత తప్పులను సరిదిద్దడానికి కేంద్ర ఎన్నికల సంఘం రెండో ప్రత్యేక సవరణ ద్వారా జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలుగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎంఐఎంలు పోటీప‌డ్డాయి. మొత్తం 119 స్థానాల్లో 88 స్థానాల్లో విజ‌యం సాధించి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.