Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్ ను సీఎం చేశాక.. బీజేపీకి రాజీనామా చేసే విషయం ఆలోచిస్తా - జితేందర్ రెడ్డి

బీజేపీని వీడే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

If you think of resigning from BJP after making Bandi Sanjay CM - Jitender Reddy
Author
First Published Oct 22, 2022, 12:29 PM IST

బండి సంజయ్ ను సీఎం చేశాక.. బీజేపీకి రాజీనామా చేసే విషయం ఆలోచిస్తానని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ దేశం కోసం, ప్రజల సంక్షేమం కోసం పోరాడుతోందని అన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి ఆయన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో సంస్థాన్ నారాయణపురంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగిత్యాల జిల్లాలో ఫేక్ సర్టిఫికేట్స్ కలకలం.. స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకుడి అరెస్ట్

బీజేపీని వదిలిపెట్టబోనని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు.  తాను ప్రగతి భవన్ లో ఉన్నానని అంటున్నారని అన్నారు. ఎవరూ నా వెంట్రుక కూడా కొనలేరని చెప్పారు. బీజేపీ సిద్ధాంత పార్టీ అని అన్నారు. అది దేశం కోసం, ప్రజల కోసం పోరాడుతోందని తెలిపారు. ఇంత గొప్ప పార్టీని వీడి వెళ్లలేనని అన్నారు. సరిగా లేని మనుషులే పార్టీని వదిలి వెళ్తారని చెప్పారు.

మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు.. నేను ప్రచారం చేసిన లాభం లేదు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం

హుజూరాబాద్ ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డిని తీసుకెళ్లారని జితేందర్ రెడ్డి అన్నారు. అలాగే మోత్కుపల్లి నర్సింహులుతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ లీడర్ ను లాక్కున్నారని తెలిపారు. కానీ ఏమైనా సాధించగలిగారా అని ప్రశ్నించారు. అక్కడ ప్రజలు బీజేపీ అభ్యర్థిని 25 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారని చెప్పారు. అలాగే మునుగోడులో కూడా ఎవరిని తీసుకెళ్లినా కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి యాబై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. బీజేపీని ఏ పరిస్థితుల్లోనూ వదలబోనని పునరుద్ఘాటించారు. తన తమ్ముడు బండి సంజయ్ ను ముందుగా సీఎం చేస్తానని, తరువాత ఆ విషయంలో ఏమైనా ఆలోచిస్తానని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios