Asianet News TeluguAsianet News Telugu

మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు.. నేను ప్రచారం చేసిన లాభం లేదు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్థానిక ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యహారం ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.

Komatireddy venkat reddy says Congress Can not Win In Munugode Bypoll
Author
First Published Oct 22, 2022, 10:43 AM IST

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్థానిక ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యహారం ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీ నుంచి తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలవడంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనకు మద్దతుగా నిలిచేందుకే కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడం లేదని ఆ పార్టీలోని ఓ వర్గం పేర్కొంటుంది. ఇప్పటికే ఆయన ఫోన్ కాల్ ఆడియో లీకేజ్, ఆస్ట్రేలియా పర్యటన కూడా ఆ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో చేసిన కామెంట్స్.. కాంగ్రెస్ పార్టీలో మరింత కలకలం రేపుతున్నాయి. 

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అభిమానులతో మాట్లాడుతూ.. మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. తాను మునుగోడులో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా ఉపయోగం ఉండదని అన్నారు. మహా అయితే 10 వేల ఓట్లు వస్తాయని ఆయన అన్నారు. ఓడిపోయే పార్టీకి ప్రచారం చేయడమెందుకని ప్రశ్నించారు. రెండు అధికార పార్టీలు కొట్లాడుతున్నప్పుడు మనమేం చేయగలమని అన్నారు. పాదయాత్ర చేద్దామని అనుకున్నానని.. కానీ కాంగ్రెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కొక్క గ్రూప్ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫైనాన్సియల్ గా చాలా బలహీనంగా ఉందని.. తాను ప్రచారానికి వెళ్తే డబ్బులు ఎవరు పెట్టాలని ప్రశ్నించారు. 25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని.. ఇక  చాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం కాంగ్రెష్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానాన్ని కోరుతుంది. 

ఇక, కాంగ్రెస్‌లో గత రెండు రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణా నుంచి కాంగ్రెస్ పార్టీని పెకిలించివేయడానికి బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నుతున్నాయని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ను పార్టీని రక్షించుకోవాలని రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు ఉద్వేగభరితమైన విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాతి రోజే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదిగా చెబుతున్న ఆడియో లీక్ అయింది. లీకైన ఆడియో టేప్ ప్రకారం.. వెంకట్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ సానుభూతిపరుడైన ఓ వ్యక్తితో మాట్లాడుతూ..  పార్టీ  చూడకుండా కోమటిరెడ్డి  రాజగోపాల్  రెడ్డికి ఓటేయాలని కోరారు. చావైనా, పెళ్లైనా రాజగోపాల్ రెడ్డి  సాయం చేస్తాడని అన్నారు. ఉపఎన్నికల తర్వాత తాను పీసీసీ చీఫ్‌గా ఎన్నికై, పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని చెప్పారు. అప్పుడు అందరిని జాగ్రత్తగా చూసుకుంటానని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ఆ ఆడియోను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటివరకు ఖండించలేదు. 

అయితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడింది తనతోనే అని దుబ్బకాల్వ గ్రామానికి చెందిన జబ్బార్‌ చెప్పారు. అయితే ఆ ఆడియో టేప్ 2018 నాటిదని తాను చెప్పాడు. ఈ మేరకు జబ్బార్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఇది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మేలు కంటే కీడే ఎక్కువ చేసింది. ఎందుకంటే.. లీక్ చేయబడిన ఆడియోలో.. మునుగోడు తర్వాత పీసీసీ అధ్యక్ష పదవిలో మార్పు వస్తుందని, తాను రాష్ట్రం మొత్తం పర్యటిస్తానని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా అందరూ రాజ్‌గోపాల్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని అన్నారు.

ఇక, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీభవన్‌లో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంకట్ రెడ్డిని ‘ద్రోహి’ అంటూ నినాదాలు చేశారు. వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా వెంకట్ రెడ్డి వ్యవహారశైలిపై పార్టీ సమావేశంలో చర్చిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మేలు కంటే కీడే ఎక్కువ చేసింది. దుబ్బకాల్వ గ్రామానికి చెందిన జబ్బార్‌ అని చెప్పుకునే వ్యక్తి ఆడియో టేప్‌ 2018 నాటిదని వీడియో సందేశం విడుదల చేశారు. మునుగోడు తర్వాత పీసీసీ అధ్యక్ష పదవిలో మార్పు వస్తుందని, తాను రాష్ట్రం మొత్తం పర్యటిస్తానని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలి. పార్టీలకు అతీతంగా అందరూ రాజ్‌గోపాల్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని అన్నారు.

ఇదిలా ఉంటే.. వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ విహార యాత్రకు వెళ్లారు. ఆస్ట్రేలియాకు పర్యటిస్తున్న ఆయన.. మునుగోడు ఉప ఎన్నికలకు ఒకరోజు ముందుగా అంటే నవంబర్ 2న తిరిగి వస్తారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios