జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫేక్ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు అయింది. ఫేక్ సర్టిఫికేట్ల కేసులో జగిత్యాలలోని స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీలో అర్దరాత్రి సైబరాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫేక్ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు అయింది. ఫేక్ సర్టిఫికేట్ల కేసులో జగిత్యాలలోని స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీలో అర్దరాత్రి సైబరాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. యూనివర్సిటీలో కొన్ని యూనివర్సిటీలకు చెందిన ఫేక్ సర్టిఫికేట్లను పోలీసులు అక్కడ గుర్తించారు. ఈ క్రమంలోనే స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సోసైటీ నిర్వహకుడు ఖలీల్‌ను అరెస్ట్ చేశారు. పలు యూనివర్సిటీలకు చెందిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫేక్ సర్టిఫికేట్లను ఇప్పటివరకు ఎవరెవరికి అందజేశారనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.