Power Cut: కరెంట్ కట్ చేస్తే బాధ్యులపై యాక్షన్ తీసుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ప్రభుత్వం తరఫున విద్యుత్ సరఫరాలో కోతల్లేవని చెప్పారు. అయితే.. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో... మరికొందరు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి కావాలనే కోతలు పెడుతున్నట్టు సమాచారం ఉన్నదని, వారిపై యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
 

if power cut happen responsible officers will be punished, warns telangana cm revanth reddy kms

CM Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ కోతలు షురూ అయ్యాయనే మాటలు ఈ మధ్య వినిపిస్తున్నాయి. అందుకే తరుచూ కరెంట్‌లో కోత పెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ప్రచారం జరిగింది. అయితే.. ఈ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తమ ప్రభుత్వం నిత్య సరఫరాకు సరిపడా కరెంట్ అందిస్తున్నదని స్పష్టం చేశారు. ఎక్కడైనా కరెంట్ కోతలు ఉంటే.. ఆ కోత పెట్టిన అధికారులు లేదా బాధ్యులపై యాక్షన్ తీసుకుంటామని వివరించారు.

ప్రభుత్వం తరఫున ఎక్కడా కోతలు పెట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ, కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కోతలు పడుతున్నట్టు అనుమానించారు. కొందరు కావాలనే కోతలు పెడుతున్నట్టూ తనకు సమాచారం వచ్చిందని తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

Also Read: CBN: కూటమి కుదిరినట్టే! వైసీపీపై దాడికి డేట్ కూడా ఫిక్స్

గతంలో కంటే కూడా ఇప్పుడు విద్యుత్ వినియోగం పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం కోసమే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాము వచ్చే ఎండకాలంలో విద్యుత్ అవసరాలు పెరిగే కొద్దీ అందుకు తగిన స్థాయిలో విద్యుత్ సరఫరా చేయడానికి కార్యచరణను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యుత్ సరఫరాకు ఇప్పటికే కార్యచరణ సిద్ధం చేసుకున్నామని వివరించారు. నిరుడు జనవరిలో 230.54 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా కాగా.. ఈ ఏడాది జనవరిలో అంతకంటే ఎక్కువ 243.12 యూనిట్ల విద్యుత్ సరఫరా చేసినట్టు వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios