వివాదంలో మరో టిఆర్ఎస్ ఎమ్మెల్యే (వీడియో)

First Published 5, Mar 2018, 8:42 PM IST
ibrahimpatnam mpp niranjan reddy fire on mla manchireddy kishan reddy
Highlights
  • ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం
  • భూములు కొట్టేద్దామని వచ్చినట్లుంది
  • ప్రొటోకాల్ పాటించకుండా ఇదేం పని?

మరో టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ప్రొటొకాల్ విషయంలో తమకు సమాచారం లేకుండానే కార్యక్రమాలు చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఇబ్రహీంపట్నం ఎంపిపి మర్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల గ్రామం లో మిషన్ భగీరథ కార్యక్రమం లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రోటోకాల్ పాటించలేదని నిరసన వ్యక్తం చేశారు. మీడియాతో తన గోడు వెల్లబోసుకున్నారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా పార్టీ నేతలు శేఖర్ , మంచాల జెడ్పీటిసి మహిపాల్ తదితరులు గ్రామపంచాయతీ ఆఫీసులో ఆందోళన వ్యక్తం చేశారు. రు.  ఎమ్మెల్యే తమ మండలంలో పర్యటించేది కేవలం.. ఎక్కడ భూములున్నాయి? ఎక్కడ కబ్జా చేయాలన్న ఉద్దేశంతో వస్తున్నట్లు ఉందని విమర్శించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడిన వీడియో కింద ఉంది.

loader