టీపీసీసీ చీఫ్ పదవి కోసం చివరివరకు రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకత్వం కట్టబెట్టింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చివరి నిమిషం వరకు ఈ పదవి కోసం ప్రయత్నించారు.
హైదరాబాద్: పీసీసీ చీఫ్ పదవిరానందుకు బాధగా ఉందని భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.గురువారం నాడు ఆయన భువనగరిలో మీడియాతో మాట్లాడారు. అన్ని అర్హతలు ఉండి కూడ పీసీసీ చీఫ్ పదవి రాకపోవడం బాధగా ఉందన్నారు. చాలా పార్టీల నుండి తనకు ఆహ్వానాలు అందాయని ఆయన చెప్పారు.
పీసీసీ అధ్యక్ష పదవి రానంత మాత్రాన పార్టీ మారాలనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని ఆయన తేల్చి చెప్పారు. తనకు ఏ పదవి కూడ అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. తనకు కొత్తగా గ్రూపులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. గాంధీభవన్ లో కూర్చొంటే ఎన్నికల్లో గెలవలేమన్నారు. ప్రజలతో మమేకమై పనిచేస్తేనే గెలుస్తామని ఆయన చెప్పారు.
also read:ముఖ్య నేతలతో గాంధీ భవన్ లో ఠాగూర్ భేటీ: నిరుద్యోగ సమస్యపై రేవంత్ పాదయాత్ర?
టీపీసీసీ చీఫ్ పదవి కోసం చివరివరకు రేసులో ఉన్నాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రేవంత్ రెడ్డికి టీసీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు తరహలోనే పీసీసీ చీఫ్ నియామకం జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ సీరియస్ గా తీసుకొన్నారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పీసీసీకి కొత్త రథసారథిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నియమించింది. ఈ దిశగా కాంగ్రెస్ నాయకత్వం ప్లాన్ చేయనుంది.
