టీఎస్ఆర్టీసీ బిల్లుకు నేను వ్యతిరేకం కాదు: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

ఆర్టీసీ బిల్లు విషయమై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  స్పష్టం  చేశారు.

Iam not Against TSRTC Bill Says Telangana Governor Tamilisai Soundararajan lns

హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులను  ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు తాను వ్యతిరేకం కాదని  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం  చేశారు.  ఆదివారంనాడు  హైద్రాబాద్ లో  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడారు.  ఆర్టీసీ బిల్లుపై  కొన్ని విషయాలపై  స్పష్టత కోసం ట్రాన్స్ పోర్టు  సెక్రటరీని చర్చలకు  రావాలని  కోరినట్టుగా  గవర్నర్ తెలిపారు.  ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ట్రాన్స్ పోర్టు సెక్రటరీతో సమావేశం కానున్నట్టుగా  గవర్నర్ చెప్పారు. ఆర్టీసీ  విలీన బిల్లుపై  సమగ్ర రిపోర్టు తీసుకుంటామన్నారు.  ఈ బిల్లుపై తాను  వీలైనంత త్వరగా  నిర్ణయం తీసుకుంటానని  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు.

నానికి అనుగుణంగా  రాష్ట్ర ప్రభుత్వం బిల్లును తయారు చేసి  గవర్నర్ ఆమోదం కోసం పంపారు.ఈ బిల్లు ఈ నెల 2వ తేదీన  తమకు  చేరిందని  రాజ్ భవన్ ప్రకటించింది. ఈ బిల్లు  రాజ్ భవన్ కు  చేరిన సమయంలో  గవర్నర్ పుదుచ్ఛేరిలో ఉన్నారు.   ఇవాళ  ఉదయం  గవర్నర్ పుదుచ్చేరి నుండి హైద్రాబాద్ కు  చేరుకున్నారు.  

ఆర్టీసీ బిల్లుకు  గవర్నర్ ఆమోదం తెలపాలని  నిన్న  రాజ్ భవన్ ను  ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు.  అయితే ఆర్టీసీకి చెందిన గుర్తింపు సంఘాల నేతలతో  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తన  సందేహలను  ఆమె కార్మికులతో పంచుకున్నారు.  ఆ తర్వాత  బిల్లుపై  రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కొన్ని ప్రశ్నలను పంపారు.  

also read:హైద్రాబాద్‌కు తమిళిసై: టీఎస్ఆర్టీసీ బిల్లు ఆమోదంపై రాని స్పష్టత

నిన్న మధ్యాహ్నం, నిన్న రాత్రి  రెండు విడుతలుగా  రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ సందేహలను పంపారు. గవర్నర్ లేవనెత్తిన అంశాలపై  ప్రభుత్వం సమాధానం పంపింది.  ఇవాళ ఉదయం మరోసారి ఆర్టీసీ అధికారులతో  గవర్నర్ మాట్లాడారు.  తన సందేహలను నివృత్తి చేసేందుకు రాజ్ భవన్ కు  రావాలని  ట్రాన్స్ పోర్టు సెక్రటరీతో పాటు  ఇతర అధికారులను  తమిళిసై సౌందరరాజన్  ఆదేశించారు. ఇవాళ మధ్యాహ్నం ఆర్టీసీ, రవాణాశాఖధికారులతో భేటీ తర్వాత  ఈ బిల్లుపై  ప్రభుత్వం  ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios