హైదరాబాద్:  నేను నీకు బానిసను కాదు.. ఉద్యమ సహచరుడినని  మాజీ మంత్రి  ఈటల రాజేందర్ కేసీఆర్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో నియంతకు చోటులేదన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు షామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ప్రజల కోసం పెట్టింది టీఆర్ఎస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. లల్లూ ప్రసాద్ యాదవ్, మాయావతి మాదిరిగా ఏర్పాటు చేసిన పార్టీ ఇది కాదన్నారు. 

also read:మంత్రులకు స్వేచ్ఛ లేదు, ప్రాణాలతో బొందపెట్టాలనుకొన్నారు: కేసీఆర్‌పై ఈటల సంచలనం

కేటీఆర్ కు సీఎం పదవి ఇచ్చుకో తమకు అభ్యంతరం లేదని తాము చెప్పామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కానీ తన కొడుకును సీఎం చేసే పేరుతో తమపై బరద చల్లే ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు.కేటీఆర్ కింద పని చేస్తానని హరీష్ రావు ప్రకటించారన్నారు. కేటీఆర్  సీఎం పదవికి అర్హుడని కూడ తాను ఆనాడు మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో  నీ కోసం అండగా ఉన్నవాళ్లు పార్టీ నుండి బయటకు వెళ్తున్నారన్నారు.  ఉద్యమ సమయంలో  నిన్ను చంపినా కుక్కను చంపినా ఒక్కటే అని విమర్శించిన వారంతా నీ వెంటే  ఉన్నారన్నారు.