IAF Plane: వాయుసేన విమానానికి తప్పిన పెను ప్రమాదం.. 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు
IAF Plane: వాయుసేన విమానానికి తప్పిన పెను ప్రమాదం తప్పింది. భారత వైమానిక దళానికి చెందిన C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం సాంకేతిక లోపంతో శుక్రవారం బేగంపేట విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని రక్షణ ప్రకటన తెలిపింది.
IAF Plane: ఇటీవల విమానాల్లో ఆకస్మికంగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రమాదాలకు గురికావడం తెలిసిందే. కొన్ని సార్లు భారీ ఎత్తున ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. శుక్రవారం హైదరాబాదులో భారత వైమానిక దళానికి చెందిన ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. దాదాపు 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరికి ఎలాగోలా పైలెట్లు ఆ విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
వివరాల్లోకెళ్తే.. భారత వైమానిక దళానికి చెందిన సి-130జె సూపర్ హెర్క్యులస్ రవాణా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం కిందికి దిగే సమయంలో హైడ్రాలిక్ వింగ్స్ తెరుచుకోలేదు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, IAF బేస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. విమానాశ్రయంలో ల్యాండింగ్ ఎమర్జెన్సీని ప్రకటించారు.
ఈ క్రమంలో విమానంలోని ఇంధనం అయిపోయేలా పైలట్ గాలిలోనే దాదాపు 40 నిమిషాల పాటు చక్కర్లు కొట్టారు. చివరికి ఎలాగోలా పైలెట్లు ఆ విమానాన్ని బేగంపేట విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం 12 మంది సురక్షితంగా ఉండడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.