హైదరాబాద్: అమిత్ ‌షాతో భేటీ తర్వాత బీజేపీలో ఎప్పుడు చేరే విషయాన్ని ప్రకటిస్తానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు.

ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా నర్సింహులు ప్రకటించారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్యాయంగా  మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ఆయన తేల్చి చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడ ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.

370 ఆర్టికల్ రద్దు తర్వాత బీజేపీ గ్రాఫ్ ఆమాంతం పెరిగిందన్నారు. దేశం కోసం బీజేపీ ఏదైనా చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ తనను ఆహ్వానిస్తోందని భావించానని.. కానీ ఆ పార్టీ తనను ఆహ్వానించలేదన్నారు.

కేసీఆర్ కు తన లాంటి వాళ్లు అవసరం లేదని మోత్కుల్లి నర్సింహులు చెప్పారు.  బీజేపీలో చేరాలని ఆ పార్టీ నేతలు తనను కలిసిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ల భేటీ: బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు
అమిత్ షా తెలంగాణ టూర్: బీజేపీలోకి టీడీపీ నేతలు