Asianet News TeluguAsianet News Telugu

అమిత్ షా తెలంగాణ టూర్: బీజేపీలోకి టీడీపీ నేతలు

తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ను బీజేపీ వేగవంతం చేసింది.ఈ నెల 18వ తేదీన అమిత్ షా టూర్ లో పలువురు నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉంది.

Amit Shah to attend public meeting on Telangana Liberation day
Author
Hyderabad, First Published Aug 11, 2019, 7:29 AM IST


హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 18వ తేదీన పర్యటించనున్నారు అమిత్ షా. అమిత్ షా పర్యటన సమయంలో పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరనున్నారు. టీఆర్ఎస్ కు చెందిన నేతలు కూడ బీజేపీ తీర్ధం పుచ్చుకొనే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు ఎంపీ స్థానాలు దక్కాయి. దీంతో తెలంగాణపై కేంద్రీకరించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్లాన్ చేసింది.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ను బీజేపీ అమలు చేస్తోంది.ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీ నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లారు. 

ప్రధానంగా టీడీపీ క్యాడర్ పై  బీజేపీ నాయకత్వం కన్నేసింది. ఈ నెల 18వ తేదీన అమిత్ షా హైద్రాబాద్ లో పర్యటించనున్నారు. తెలంగాణలోనే అమిత్ షా బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోనున్నారు. 

తెలంగాణపై బీజేపీ లక్ష్యంగా చేసుకోని పావులు కదుపుతోంది. ఇప్పటికే కొందరు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. మరికొందరు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ నెల 18వ తేదీన హైద్రాబాద్ లో బీజేపీ సభను నిర్వహిస్తుంది. గ్రేటర్ హైద్రాబాద్ లో తమ బలాన్ని పెంచుకొనే ఉద్దేశ్యంతో బీజేపీ ఈ సభను ఏర్పాటు చేసింది.

గ్రేటర్ హైద్రాబాద్ కు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరనున్నారు.  ఎంపీ గరికపాటి మోహన్ రావు అమిత్ షా సమక్షంలో ఈ నెల 18వ తేదీన జరిగే సభలో బీజేపీ తీర్ధం పుచ్చుకొంటారు. 

రానున్న ఏడాదిన్నరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో గ్రేటర్ పై బీజేపీ కన్నేసింది. జీహెచ్ఎంసీలో ఎక్కువ కార్పోరేటర్లను కైవసం చేసుకొంటే వచ్చే ఎన్నికల్లో ఎక్కువ అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొనే అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

గరికపాటి మోహన్ రావుతో పాటు గతంలో టీడీపీలో ఉండి ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో ఉన్న నేతలు కూడ బీజేపీ తీర్ధం పుచ్చుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. గరికపాటి మోహన్ రావు వెంటే మాజీ టీడీపీ నేత లంకల దీపక్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. 

గ్రేటర్ హైద్రాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎంఎన్ శ్రీనివాస్ ఇటీవల కాలంలో టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఆయన బీజేపీలో చేరాలని భావిస్తున్నారని సమాచారం. గరికపాటి మోహన్ రావుతో కలిసి  ఎంఎన్ శ్రీనివాస్ బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణలోని పలు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలతో కూడ గరికపాటి మోహన్ రావు టచ్ లో ఉన్నట్టుగా చెబుతున్నారు. వీరంతా బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్రానికి చెందిన పలువురు టీడీపీ నేతలతో కూడ గరికపాటి మోహన్ రావుకు మంచి సంబంధాలున్నాయి.ఈ సంబంధాలను ఉపయోగించుకొని టీడీపీ క్యాడర్ బీజేపీలో చేరేలా గరికపాటి వ్యూహం రచిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

 

సంబంధిత వార్తలు

కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ల భేటీ: బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు

 

Follow Us:
Download App:
  • android
  • ios