హైదరాబాద్:  రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని ఉపసంహరించుకొంటున్నట్టు  రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రకటించారు.మంగళవారం నాడు మంత్రి కేటీఆర్‌తో కలిసి సోమారపు సత్యనారాయణ తెలంగాణ భవన్ కు వచ్చారు. అంతకుముందు కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో కేటీఆర్ తో  ఆయన సమావేశమయ్యారు.

రామగుండం మేయర్ పై అవిశ్వాసం విషయమై చర్చించారు.  రాజకీయాల నుండి తప్పుకోవాలనే నిర్ణయాన్ని  ఉపసంహారించుకోవాలని కేటీఆర్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను కోరారు. దీంతో  ఆయన సానుకూలంగా స్పందించారు.

ఈ విషయాన్ని తెలంగాణ భవన్ ‌లో సోమారపు సత్యనారాయణ ప్రకటించారు.  తన పనిని తాను చేసుకొంటు పోతున్నట్టు ఆయన తెలిపారు.  మేయర్ పై అవిశ్వాసం పెట్టాలనే ప్రతిపాదన కార్పోరేటర్లదని ఆయన చెప్పారు.  

తాను ఏనాడూ  కూడ  పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని  ఆయన చెప్పారు.  పార్టీ నేతల అభిప్రాయం మేరకు తాను రాజకీయాల నుండి తప్పుకోవాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకొంటున్నట్టు ఆయన ప్రకటించారు.