Asianet News TeluguAsianet News Telugu

అమ్మోనియం నైట్రేట్‌ రీ ప్రాసెస్:హైద్రాబాద్ కు చేరిన 700 టన్నుల నైట్రేట్

హైద్రాబాద్ కు 700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు చేరుకొన్నాయి..హైద్రాబాద్ లోని సాల్వో కంపెనీ అమ్మోనియం నైట్రేట్ ను రీ ప్రాసెస్ చేయనుంది.

Hyderabadbased company buys 700 ton ammonium nitrate, to be stored at Keesara
Author
Hyderabad, First Published Aug 11, 2020, 5:08 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్ కు 700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వలు చేరుకొన్నాయి..హైద్రాబాద్ లోని సాల్వో కంపెనీ అమ్మోనియం నైట్రేట్ ను రీ ప్రాసెస్ చేయనుంది.

చెన్నై పోర్టు నుండి 10 కంటైనర్ల అమ్మోనియం నైట్రేట్ హైద్రాబాద్ కు చేరుకొంది. కీసరగుట్టలోని సాల్వో కంపెనీలో అమ్మోనియం నైట్రేట్ ను రీ ప్రాసెస్ చేయనుంది.  కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య అమ్మోనియం నైట్రేట్ ను హైద్రాబాద్ కు తరలించింది.

రీ ప్రాసెస్ చేసిన తర్వాత అమ్మోనియం నైట్రేట్ ను కోల్ ఇండియా, సింగరేణితో పాటు నీటి పారుదల ప్రాజెక్టులకు సరఫరా చేయనున్నారు.  అమ్మోనియం నైట్రేట్ ను రెండు రోజుల్లో రీ ప్రాసెస్ చేయనున్నారు. 

లెబనాన్ రాజధాని భీరూట్ లో అమ్మోనియం నైట్రేట్ పేలుళ్లతో భారీ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. చెన్నైలోని అమ్మోనియం నైట్రేట్ ను రీ ప్రాసెస్ చేయడాన్ని సాల్వో కంపెనీ టెండర్ ద్వారా దక్కించుకొంది.

సాల్వో కంపెనీలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలను మేడ్చల్ జిల్లా యంత్రాంగం పరిశీలించింది. మరికొన్ని రోజుల్లో మరో 20 కంటైనర్ల అమ్మోనియం నైట్రేట్ హైద్రాబాద్ కు రానుంది. దేశవ్యాప్తంగా అమ్మోనియం నైట్రేట్ కొనుగోలులో హైద్రాబాద్ మూడో స్థానంలో ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios