హైదరాబాద్ పాతబస్తీలో పోకిరీలు రెచ్చిపోయారు. బైక్ రేసింగ్‌‌లలో రోడ్డుపై వెళ్తున్నవారిని హడలెత్తించారు. నిత్యం రద్దీగా ఉండే చంచల్‌గూడ, మాదన్న పేట్, డబీర్‌పుర రోడ్ల మీద బైక్స్‌తో స్టంట్స్ చేశారు. 

హైదరాబాద్ పాతబస్తీలో పోకిరీలు రెచ్చిపోయారు. బైక్ రేసింగ్‌‌లలో రోడ్డుపై వెళ్తున్నవారిని హడలెత్తించారు. నిత్యం రద్దీగా ఉండే చంచల్‌గూడ, మాదన్న పేట్, డబీర్‌పుర రోడ్ల మీద బైక్స్‌తో స్టంట్స్ చేశారు. 100 నుంచి 150 బైక్‌లతో అర్ధరాత్రి నుంచి తెల్లవారే దాకా పోకిరి రోడ్లపై బైక్ రేసింగ్ నిర్వహించారు. చిత్రవిచిత్రమైన విన్యాసాలతో.. బైక్‌లను అతి వేగంగా నడుపుతూ ఇతర వాహనదారుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. 

దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు పోలీస్ స్టేష‌న్లకు సమాచారం అందజేశారు. ఆ సమాచారంతో రంగంలోకి దిగిన చంచల్‌గూడ, డబీర్‌పుర, మాదన్నపేట పోలీసులు పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలను సీజ్ చేశారు.