హైదరాబాదీ మహిళ అబుదాబిలో రూ. 2 కోట్లు లక్కీ డ్రాలో గెలుచుకున్నారు. మూడేళ్లుగా అబుదాబిలో నివసిస్తున్న ఆమె మెడికల్ కోడర్‌గా పని చేస్తున్నారు. 

హైదరాబాద్: అబుదాబీలో ఉంటున్న 38 ఏళ్ల హైదరాబాదీ మహిళ రూ. 2 కోట్ల లక్కీ డ్రా గెలుచుకున్నారు. యూఏఈలో ప్రతి వారం మహజూజ్ డ్రా తీస్తుంటారు. ఈ డ్రాలో కచ్చితంగా ఒకరు కోట్ల రూపాయలు గెలుచుకుంటారు. ఈ లక్కీ డ్రాలో పాల్గొన్న హేమదా బేగం అదృష్టవశాత్తు గెలుపొందారు.

ఏప్రిల్ 1వ తేదీన జరిగిన 122వ వారం మెహజూజ్ డ్రాలో హమేదా బేగం గెలుపొందారు. హమేదా బేగం యూఏఈ రాజధాని అబుదాబిలో గత మూడు సంవత్సరాలుగా నివసిస్తున్నారు. అక్కడ మెడికల్ కోడర్‌గా పని చేస్తున్నారు. తాను మహజూర్ డ్రా గెలుచుకున్న విషయం తెలియగానే ఆమె ఆనందంలో మునిగిపోయారు.

Also Read: అవినీతి కేసులో అరెస్టు చేయడానికి ఏసీబీ రావడంతో ఫోన్‌లు నదిలో విసిరేశాడు.. రంగంలోకి దిగిన సీబీఐ

Scroll to load tweet…

తాను గెలిచిన డబ్బును కొంత చారిటీకి ఇస్తానని, మిగిలిన డబ్బులను పిల్లల చదువులకు, కుటుంబ భవిష్యత్తు సుస్థిరంగా ఉండటానికి ఖర్చు పెట్టుకుంటానని వివరించింది.

యూఏఈలో మహజూజ్ డ్రా ఫేమస్. చాలా మంది అందులో పాల్గొని తమ అదృష్టాన్నిపరీక్షించుకుంటారు.