మరో మహిళతో రాసలీలు సాగిస్తున్న భర్తను ఓ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తనను మోసం చేసిన అతడిపై దాడికి దిగింది. భర్త వివాహేతర సంబంధం (extramarital affair) గురించి తెలుసుకున్న ఆమె పక్కా ప్లాన్‌తో భర్త గుట్టును రట్టు చేసింది.  ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ పరిధిలోని తులసీనగర్‌లో చోటుచేసుకుంది.

వివాహతర సబంధాలు.. పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. కొందరి జీవితాల్లో ఇలాంటి బంధాలు విషాదాన్ని నింపుతుంటే.. మరికొందరు జీవితాల్లో ప్రశాంతతను దెబ్బతీసి, ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తాజాగా పెళ్లి చేసుకుని.. మరో మహిళతో రాసలీలు సాగిస్తున్న భర్తను ఓ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. తనను మోసం చేసిన అతడిపై దాడికి దిగింది. భర్త వివాహేతర సంబంధం (extramarital affair) గురించి తెలుసుకున్న ఆమె పక్కా ప్లాన్‌తో భర్త గుట్టును రట్టు చేసింది. ఇందకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఆమె భర్తను, మరో మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ పరిధిలోని తులసీనగర్‌లో బుధవారం రాత్రి (Kukatpally) చోటుచేసుకుంది. 

Also read: మెట్రోపై సజ్జనార్ వార్..? వామ్మో మాములుగా లేదుగా.. ఈ వీడియో చూడండి..

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెద్దపరిమికి చెందిన ప్రకాశ్‌కు అదే జిల్లాకు చెందిన త్రివేణితో 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో త్రివేణి కుటుంబ సభ్యలు.. ప్రకాశ్‌కు కట్నంగా (Dowry) రూ. 20 లక్షల నగదు, 30 సవర్లబంగారు ఆభరణాలు, 3 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రకాశ్ బంజారాహిల్స్‌లోని ఓ సాఫ్టవేర్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంటుగా పనిచేస్తున్నాడు. పెళ్లి జరిగాక.. కొన్ని రోజులు మాత్రమే వీరి కాపురం హ్యాపీగా సాగింది. 

Also read: తెలంగాణ కాంగ్రెస్ యువనేతకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు.. రేవంత్‌ రెడ్డికి చెక్?

ఎన్నో ఆశలతో భర్తతో జీవితాన్ని ఊహించుకున్న త్రివేణికి.. నెల రోజులకే షాక్ తగిలింది. ప్రకాశ్.. ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. త్రివేణిని హైదరాబాద్‌కు తీసుకుని వచ్చాక.. ఆమెను వేధించడం స్టార్ట్ చేశారు. అకారణంగా ఆమెను హింసించేవాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. భార్యభర్తలు ఏకాంతంగా ఉన్న ఫొటోలను ప్రకాశ్ అతని స్నేహితులకు చూపించేవాడని కన్నీరు పెట్టుకుంది. ప్రకాశ్ వేధింపులు తట్టుకోలేక త్రివేణి ఆత్మహత్య యత్నం (Suicide Attempt) చేశానని.. అయితే ప్రకాశ్ ఈ విషయాన్ని కూడా పట్టించుకోలేదని ఆరోపించింది. చాలా సందర్బాల్లో ప్రకాశ్ రాత్రిళ్లు ఇంటికి కూడా వచ్చేవాడు కాదని ఆమె తెలిపింది. ఇక, ఆరు నెలలుగా ప్రకాశ్ త్రివేణిని అసలు పట్టించుకోకుండా తిరుగుతున్నాడని ఆమె కుటుంసభ్యులు తెలిపారు. 

Also read: ధాన్యం కొనుగోళ్లు.. సాయంత్రం 5 లోపు కేంద్రం నుంచి లేఖ తీసుకురండి: బండి సంజయ్‌ దీక్షకు నిరంజన్ రెడ్డి కౌంటర్

ఇటీవల భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే సంగతి తెలిసింది. దీంతో ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. వారితో కలిసి ప్రకాశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి కేపీహెచ్‌బీ తులసీనగర్‌లో ప్రకాశ్, మరో మహిళతో ఉండగా త్రివేణి తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లింది. ప్రకాశ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రకాశ్‌ను, మరో మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.