Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదులో రెండు రైళ్లు ఢీ: లోకో పైలట్ దే తప్పిదం

హైద్రాబాద్ కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు హంద్రీ ఎక్ష్‌ప్రెస్ రైలును ఢీకొన్న ఘటనలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Hyderabad train collision: Human error suspected, train driver booked
Author
Hyderabad, First Published Nov 13, 2019, 4:12 PM IST

హైదరాబాద్:ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ నిర్లక్ష్యం వల్లే  ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు తేల్చారు. కాచిగూడ రైల్వే స్టేషన్ మేనేజర్ థశరథ్ కూడ లోక్‌పైలట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

హంద్రీ ఎక్స్‌ప్రెస్ వెళ్లడానికి సిగ్నల్ ఇస్తే చంద్రశేఖర్ గమనించకుండానే  ఎంఎంటీఎస్‌ రైలును  ముందుకు నడిపంచాడని దశరథ్ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కాచిగూడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also read:కాచిగూడ ప్రమాదం: డ్రైవర్ చంద్రశేఖర్ పరిస్ధితి విషమం, హెల్త్ బులెటిన్ విడుదల

కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సిగ్నలింగ్ లోపం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని తొలుత భావించారు. అయితే ఈ విషయమై కూడ జీఆర్పీ పోలీసులు విచారణ చేయనున్నారు. స్టేషన్‌మాస్టర్‌తో పాటు సిగ్నలింగ్‌ విభాగంలో పనిచేసే ఏడుగురిని విచారించనున్నట్టుగా పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు
 
ఎంఎంటీఎస్‌ రైలు లోకో పైలట్‌ తప్పిదం వల్లే ప్రమాదం జరిగింది. హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు నాలుగో ప్లాట్‌ఫాం వద్దకు వెళ్తుండగా అదే సమయంలో లింగంపల్లి నుంచి కాచిగూడకు వచ్చిన ఎంఎంటీఎస్‌ రైలు రెండో ప్లాట్‌ఫాం వద్ద ఆగింది. 

రెడ్‌ సిగ్నల్‌ ఉన్నప్పటికీ లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ గమనించకుండా ముందుకు వెళ్లడంతోనే హంద్రీ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టిందని రైల్వే ఉన్నతాధికారులు చెప్పారు.ఈ విషయమై విచారణ చేస్తున్నట్టుగా రైల్వే అధికారులు ప్రకటించారు. లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. 

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్‌, హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఢీకొన్న ఘటనలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను అధికారులు 24 గంటల్లో పునరుద్ధరించారు. సోమవారం ఉదయం 10.45 నిముషాలకు రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో సిగ్నల్‌ లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద రైల్వే ట్రాక్‌ పూర్తిగా దెబ్బతింది. సోమవారం రాత్రి 7 గంటలకు రైల్వే అధికారులు రైలు ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు. 

బుధవారం నాడు రైల్వే సేఫ్టీ మేనేజర్ రామ్‌కృపాల్  నేతృత్వంలో కమిటీ విచారణ చేశారు. ప్రమాదం జరిగిన స్థలంలో రామ్‌కృపాల్ కమిటీ విచారణ చేసింది.ప్రమాదానికి కారణాలను కమిటీ విచారణ చేస్తోంది.

Also Read:డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: రైల్వే ఏజీఎం

ప్రమాదం జరిగిన స్థలంలో ఏ ట్రాక్‌పై ఎంత దూరంలో రైళ్లు ఉన్నాయనే  విషయమై కమిటీ సభ్యులు తెలుసుకొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు ఇతర విషయాలపై కూడ కమిటీ పరిశీలించింది.

Also Read:mmts train accident: కాచిగూడలో రెండు రైళ్ల ఢీ, 30 మందికి గాయాలు

ఈ ప్రమాదానికి సంబంధించి రైలు నిలయంలో కూడ విచారణ చేస్తామని కమిటీ ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను ప్రత్యక్షసాక్షులను కూడ విచారించాలని కమిటీ భావిస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతానికి లోకో‌పైలట్ నిరల్కస్యమే కారణంగా రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారు. చంద్రశేఖర్ నుండి వివరాలను సేకరించాలని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios