జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం తర్వాత బ్లాక్ గ్లాస్ ఉన్న వాహనాలను పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు.
హైదరాబాద్: Hyderabad లో బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలపై Traffic Police కొరడా ఝుళిపిస్తున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే, ప్రెస్, పోలీస్ వంటి స్టిక్కర్లున్న వాహనాలను కూడా చెక్ చేస్తున్నారు.
ఈ నెల 17వ తేదీన రాత్రి Jubilee hills లో రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ రోడ్డు ప్రమాదంలో రెండు మాసాల చిన్నారి మృతి చెందింది. మరో ముగ్గురు గాయపడ్డాు. ఈ ఘటనలో Bodhan ఎమ్మెల్యే Shakeel కజిన్ మీర్జా ను అతని కొడుకును కూడా పోలీసులు arrest చేశారు. అయితే విచారణలో ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే కొడుకు Raheel కూడా ఈ సమయంలో ఉన్నట్టుగా పోలీసులు ప్రకటించారు. ఎమ్మెల్యే కొడుకు రాహిల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు పలు వాహనాలపై దృష్టి పెట్టారు. ప్రెస్,పోలీస్, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనాలను పోలీసు లు తనిఖీ చేస్తున్నారు అంతేకాదు బ్లాక్ కలర్ గ్లాస్ ఉన్న వాహనాలను ఎక్కడికక్కడే నిలిపి తనిఖీ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన ఉపయోగించిన కారుకు కూడా బ్లాక్ గ్లాస్ ఉంది. ఉమ్మడి ఏపీ రాస్ట్రంలోనే బ్లాక్ గ్లాస్ ఉపయోగించడంపై Police నిషేధం విధించారు.
అయినా కూడా ఈ వాహనానికి బ్లాక్ గ్లాస్ ఉపయోగించారు. ఈ కారుకు బ్లాక్ గ్లాస్ ఉండడం వల్ల CCTV దృశ్యాలను చూసినా ఫలితం లేకుండా పోయింది. కారులో ఎవరున్నారనే విషయాన్ని గుర్తించడం బ్లాక్ గ్లాస్ వల్ల సాధ్యపడలేదని పోలీసులు చెప్పారు.
అయితే ఈ కేసులో ఎమ్మెల్యే షకీల్ వీడియో విడుదల చేయడంతో పోలీసులు మీర్జాను ఆయన కొడుకును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్న విషయాన్ని పోలీసులు తమ దర్యాప్తులో తెలుసుకొన్నారు.జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బ్లాక్ గ్లాస్ ఉన్న వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. బ్లాక్ గ్లాస్ ను తొలగించాలని పోలీసులు ఆదేశిస్తున్నారు.
జడ్ , జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వారి వాహనాలకు మాత్రమే బ్లాక్ గ్లాస్ ఉపయోగించేందుకు అనుమతి ఉందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను తారుమారు చేయడం, వాహనాలపై స్టిక్కర్లు అనధికారికంగా ఉపయోగించడం వంటివి నేరమన్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్రీత్యా చర్యలు తీసుకొంటామన్నారు.
