Asianet News TeluguAsianet News Telugu

ఇది మన సంస్కృతి కాదు.. : న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్య‌లు

Hyderabad: క‌రోనా కార‌ణంగా ఆంక్ష‌ల మ‌ధ్య కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌రుపుకున్న రేండేండ్ల త‌ర్వాత నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు హైద‌రాబాద్ నగరం సిద్ధమైంది. ఇప్ప‌టికే దుకాణాలు, మాల్స్ లైట్లతో అలంకరించబడ్డాయి. తాత్కాలిక దుకాణాలు ప్రధాన మార్కెట్ ప్రాంతాలు లైట్ల వెలుగులు విర‌జిమ్ముతున్నాయి. 
 

Hyderabad : This is not our culture; Suspended BJP MLA Raja Singh's comments on New Year celebrations
Author
First Published Dec 29, 2022, 10:54 AM IST

Telangana BJP Leader Raja Singh: మ‌రో రెండు రోజుల్లో యావ‌త్ ప్ర‌పంచం కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు జ‌రుపుకోవ‌డానికి సిద్ద‌మవుతోంది. భార‌త్ లోనూ న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జరుపుకోవడానికి యువత, పెద్దల్లో ఉత్సాహం కనిపిస్తోంది. రోనా కార‌ణంగా ఆంక్ష‌ల మ‌ధ్య కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌రుపుకున్న రేండేండ్ల త‌ర్వాత  నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు హైద‌రాబాద్ నగరం సిద్ధమైంది. ఇప్ప‌టికే దుకాణాలు, మాల్స్ లైట్లతో అలంకరించబడినప్పటికీ, తాత్కాలిక దుకాణాలు ప్రధాన మార్కెట్ ప్రాంతాలు లైట్ల వెలుగులు విర‌జిమ్ముతున్నాయి. అయితే, దీనిపై భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), దాని అనుబంధ సంస్థ‌లకు చెందిన వారు నూత‌న సంవ‌త్స‌ర‌ వేడుక‌ల‌పై చేస్తున్న‌ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. 

తెలంగాణ నుంచి సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యే టీ రాజా సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఒక వీడియో ప్ర‌సంగంలో ఆయ‌న, కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం భారతీయ సంస్కృతి కాదని రాజా సింగ్ బుధవారం అన్నారు. ఇది చెడు పద్ధతిగా అభివర్ణించిన ఆయన, యువత తమ మాతృభూమి సంస్కృతిపై అవగాహన కలిగి ఉండాలని, భారతీయులు కానిది ఏదైనా జరుపుకోవద్దని అన్నారు. దేశంలోని యువత అవగాహన కలిగి ఉండాలనీ, జనవరి 1న కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవద్దని అన్నారు.

రాజా సింగ్ వీడియోలో మాట్లాడుతూ, “నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం భారతీయ సంస్కృతి కాదు, అది పాశ్చాత్య సంస్కృతి. ఇది భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన వారి సంస్కృతి. ఇది తప్పుడు పోకడని, యువత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో, వేర్వేరు తేదీల్లో జరుపుకునే కొత్త సంవత్సరాన్ని భారతదేశంలో జనవరి 1న జరుపుకోకూడదని రాజా సింగ్ అన్నారు. కాగా, రాజాసింగ్ వ్యాఖ్య‌లు మ‌రోసారి వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

మహ్మద్ ప్రవక్తపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో  జైలు పాలయ్యారు..

ఈ ఏడాది ఆగస్టు 23న తెలంగాణ ఎమ్మెల్యే టీ రాజా సింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. ఆయ‌న ఒక వీడియో ప్ర‌సంగంలో ముస్లింల ఆరాధ్యదైవం ప్రవక్త మహ్మద్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కనిపించింది. మహ్మద్ ప్రవక్తపై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై పోలీసులు అతన్ని కూడా అరెస్టు చేశారు. అదే సమయంలో, ప్రవక్త గురించి రాజా సింగ్ వీడియో వైరల్ కావడంతో హైదరాబాద్‌లో ముస్లిం సమాజం తరపున నిరసనలు జరిగాయి. ఆ తర్వాత ఈ వ్యవహారంపై రాజాసింగ్‌పై కేసు నమోదైంది. ఈ క్ర‌మంలోనే రాజాసింగ్ ఇదివ‌ర‌కు వివాదాస్ప వ్యాఖ్య‌లు, వివిధ వ‌ర్గాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకునేలా శాంతికి భంగం క‌లిగిస్తున్నార‌ని పేర్కొంటూ హైద‌రాబాద్ పోలీసులు ఆయ‌న‌పై పీడీ యాక్ట్ ప్ర‌యోగించి, జైల్లో పెట్టారు.

న్యూఇయ‌ర్ వేడుక‌లకు సిద్ధ‌మైన భాగ్య‌న‌గ‌రం ! 

క‌రోనా కార‌ణంగా ఆంక్ష‌ల మ‌ధ్య కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జ‌రుపుకున్న రేండేండ్ల త‌ర్వాత నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు హైద‌రాబాద్ నగరం సిద్ధమైంది. ఇప్ప‌టికే దుకాణాలు, మాల్స్ లైట్లతో అలంకరించబడ్డాయి. తాత్కాలిక దుకాణాలు ప్రధాన మార్కెట్ ప్రాంతాలు లైట్ల వెలుగులు విర‌జిమ్ముతున్నాయి. కొత్త సంవ‌త్స‌రం క్ర‌మంలో వ్యాపారం ప్ర‌స్తుతం మెరుగ్గానే ఉంద‌ని చిరువ్యాపారులు పేర్కొంటున్నారు. కోటిలోని తాత్కాలిక స్టాల్‌లో అలంకార వస్తువులు, బహుమతి వస్తువులను విక్రయిస్తున్న వారు రానున్న వారంలో మరింత మెరుగైన విక్రయాలను ఆశిస్తున్నారు. నూతన సంవత్సర వేడుక‌ల కోసం బాణసంచా విక్ర‌యాలు కూడా పెరుగుతున్నాయ‌ని స‌మాచారం.
 

Follow Us:
Download App:
  • android
  • ios