అమెరికాలో హైద్రాబాద్ టెక్కీ పాండు రాఘవేందర్ రావు అదృశ్యం

Hyderabad Techie Missing In US, Father Appeals Sushma Swaraj For Help
Highlights

హైద్రాబాద్ టెక్కీ పాండు రాఘవేందర్ రావు అదృశ్యం


హైదరాబాద్: హైద్రాబాద్‌కు చెందిన  36 ఏళ్ళ పాండు రాఘవేంద్రరావు   అమెరికాలో ఏడాది కాలంగా అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ  కోసం సహకరించాలని పాండు రాఘవేంద్రరావు  కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కోరారు. 

2017 అక్టోబర్ మాసంలో  అమెరికాలోని కాలిఫోర్నియాలో  పాండు రాఘవేంద్రరావు  అదృశ్యమయ్యాడు.  పాండు రాఘవేంద్రరావు  తండ్రి పి. బంగారం  మార్కెటింగ్ శాఖలో ఇంజనీర్‌గా పనిచేసి  ఉద్యోగ విరమణ చేశారు.  మైక్రోసాఫ్ట్‌లో కాలిపోర్నియాలో పనిచేసేందుకు  2011 డిసెంబర్ 26న వెళ్ళాడు. 

 

 

 అమెరికాకు వెళ్ళిన నాటి నుండి  తన కొడుకుతో ఫోన్ లో , వాట్సాప్ లో  కూడ తాను తరచూ మాట్లాడేవాడినని పి.బంగారం చెబుతున్నారు. అయితే 2017 అక్టోబర్ మాసం నుండి పి. బంగారం తనకు టచ్‌లో లేకుండా వెళ్ళాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ విషయమై  తెలంగాణ  ఐటీ శాఖ మంత్రికి వినతి పత్రం సమర్పించినట్టుగా  పి. బంగారం చెప్పారు. అదే విధంగా  ఇదే విషయమై కేంద్ర  విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను చొరవ చూపాలని పాండు రాఘవేందర్ రావు  తండ్రి పి. బంగారం కోరారు. లండన్‌లో ఎంటెక్ పూర్తి చేసిన పాండు రాఘవేందర్ రావు  ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్ళాడు. ఎంబిటి నేత అమ్జదుల్లా ఖాన్  కూడ ఈ విషయమై ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాండు రాఘవేందర్ రావు ఆచూకీ కోసం ప్రయత్నించాలని  ఎంబిటి నేత ట్విట్టర్ ద్వారా కోరారు.

loader