హైదరాబాద్: టెక్కీ లావణ్యను హత్య చేసిన సునీల్‌కుమార్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వారం రోజుల పాటు తీవ్రంగా శ్రమించారు. లావణ్యను హత్య చేసిన సునీల్ అత్యంత తెలివిగా ఈ కేసు నుండి తప్పించుకొనే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని భెల్ ఎల్ఐజీ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు కూతురు లావణ్య అనుమానస్పదస్థితిలో అదృశ్యమైందని ఈ నెల 7వ తేదీన కుుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 2011-2015లోనల్లా మల్లారెడ్డి కాలేజీలో లావణ్య ఇంజనీరింగ్ చదివే సమయంలో బీహార్ కు చెందిన సునీల్ కుమార్ తో పరిచయం ఏర్పడిన విషయాన్ని పోలీసులు గుర్తించారు.

2017లో లావణ్యను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని  నిర్ణయం తీసుకొన్నట్టుగా  శ్రీనివాసరావుకు సునీల్ చెప్పాడు. వీరిద్దరి పెళ్లికి లావణ్య కుటుంబసభ్యులు కూడ అంగీకరించారు. లావణ్యతో సునీల్ నిశ్చితార్ధం కోసం ముహుర్తాన్ని కూడ నిర్ణయించారు. కానీ ఆ సమయంలో తమ అన్న, వదినకు ప్రమాదం జరిగిందని  చెప్పినట్టుగా కుటుంబసభ్యులు గుర్తు చేసుకొన్నారు. అయితే సునీల్ కుమార్ అన్న వదినను పరామర్శించేందుకు తాము వస్తామంటే కూడ సునీల్ వ్యతిరేకించిన విషయాన్ని కూడ వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మస్కట్‌లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఉందని చెప్పి లావణ్యను సునీల్ ఈ నెల 4వ తేదీన తీసుకెళ్లాడు. ఈ నెల 7వ తేదీ ఉదయం మేసేజ్‌ వచ్చింది. తాను ఇంటికి తిరిగి వస్తున్నట్టు మియాపూర్ లోకేషన్ పంపించింది. ఆ తర్వాత ఆమె ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసింది. అయితే సునీల్‌కు ఫోన్ చేస్తే తానుమరునాడు మస్కట్‌ నుండి హైద్రాబాద్‌కు వస్తున్నట్టు లావణ్య కుటుంబసభ్యులకు చెప్పాడు. లావణ్య ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆయన కూడ ఆందోళనకు గురైనట్టుగా ఫోన్‌లో చెప్పాడు.

ఆ మరుసటిరోజునే సునీల్‌ సెల్‌ఫోన్ నుండి  కూడ అతడిని కిడ్నాప్ చేశారని...  కొంత సేపటికి అతడిని హత్య చేసినట్టుగా మరో మేసేజ్ వచ్చింది. ఈ వివరాలను లావణ్య కుటుంబసభ్యులు పోలీసులకు వివరించారు.

లావణ్య, సునీల్ కుమార్ కిడ్నాప్‌కు గురైతే లావణ్య సెల్‌ఫోన్ నుండి, సునీల్ ఫోన్ నుండి మేసేజ్‌లు లావణ్య కుటుంబసభ్యులకు ఎలా వచ్చాయని పోలీసులు ఆలోచించారు. అంతేకాదు సునీల్‌ను హత్య చేస్తే లావణ్య కుటుంబసభ్యులకు ఎందుకు మేసేజ్ ఇచ్చారనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. ఈ నెల 4వ తేదీన మస్కట్‌ వెళ్లేందుకు లావణ్యను సునీల్ తీసుకెళ్లాడని పోలీసులు తెలుసుకొన్నారు

ఈ నెల 4వ తేదీ రాత్రి లావణ్య,సునీల్ కుమార్‌లు శంషాబాద్ నుండి మస్కట్ వెళ్లే విమానంలో ప్రయాణం చేయలేదని పోలీసులు గుర్తించారు.మస్కట్ వెళ్లకుండానే వెళ్లినట్టుగా డ్రామాలు ఆడారని గుర్తించారు.

సునీల్ గురించి పోలీసులు ఆరా తీశారు. సునీల్ ఫోన్ స్విఛ్ఛాప్ చేయడంతో అతను చివరగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన లోకేషన్ సూరారం కాలనీలో ఉందని పోలీసులు గుర్తించారు. లావణ్య ఫోన్ సిగ్నల్స్ కూడ అదే ప్రాంతంలో పోలీసులకు చిక్కాయి. అయితే ఈ ప్రాంతంలో సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఈ సీసీటీవీ పుటేజీల్లో సునీల్ ఒక్కడే వచ్చినట్టుగా రికార్డైంది.

తన ప్లాన్‌ను లావణ్య కుటుంబసభ్యులు నమ్మారని సునీల్ కుమార్ భావించాడు. ఈ నెల 13వ తేదీన సూరారం కాలనీలో  తాను ఉంటున్న ఇంటికి సునీల్ కుమార్ చేరుకొన్నాడు. అప్పటికే అక్కడ మఫ్టీలో పోలీసులు మాటు వేశారు. సునీల్ ఇంటికి రాగానే అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది.

సంబంధిత వార్తలు

టెక్కీ లావణ్య హత్య కేసులో ట్విస్ట్: పేరేంట్స్‌ను నమ్మించాడు

టెక్కీ లావణ్య కేసు: ఇంటర్వ్యూకు తీసుకెళ్తున్నానని చెప్పి హత్య

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య: ప్రియుడే హంతకుడు