హైదరాబాద్: హత్య చేసిన తర్వాత కూడ లావణ్య బతికే ఉన్నట్టుగా కుటుంబసభ్యులను ఆమె ప్రియుడు సునీల్  నమ్మించాడు.  ప్రేమ పేరుతో లావణ్యతో లైంగిక సంబంధాలను కొనసాగించాడు. మోజు తీరిన తర్వాత ఆమెను హత్యచేసినట్టుగా గుర్తించామని పోలీసులు చెబుతున్నారు.

టెక్కీ లావణ్య హత్య కేసులో  సంచలన విషయాలు వెలుగు చూశాయి.  ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆమె ప్రియుడు సునీల్ కుమార్‌ నిందితుడని పోలీసులు చెప్పారు. సునీల్ కుమార్‌ను విచారించిన పోలీసులు ఆసక్తికర విషయాలను  బయటపెట్టారు.

నల్లా మల్లారెడ్డి కాలేజీలో సునీల్ కుమార్, లావణ్య ఇంజనీరింగ్ చదివారు. 2011 నుండి 2016 వరకు చదివారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత సునీల్ కుమార్ మెరిగామ్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. లావణ్య టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

నల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన స్నేహితులు వాట్సాప్ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్‌ ద్వారానే  వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని పోలీసుల విచారణలో తేలింది.

నాలుగు ఏళ్లుగా వీరిద్దరూ కలిసి తిరిగారు. నాలుగేళ్లుగా లావణ్యతో సునీల్ కుమార్ శారీరక సంబంధాన్ని కొనసాగించినట్టుగా తమ విచారణలో తేలిందని  పోలీసులు చెప్పారు. అయితే పెళ్లి చేసుకోవాలని సునీల్‌కుమార్‌పై  లావణ్య ఒత్తిడి  తీసుకొచ్చింది.

దీంతో ఆమెను హత్య  చేయాలని సునీల్‌కుమార్ ప్లాన్ చేశాడు. మస్కట్‌లో తనకు జాబ్ వచ్చిందని సునీల్ కుమార్ లావణ్యను ఆమె తల్లిదండ్రులను నమ్మించాడు. లావణ్యకు కూడ మస్కట్‌లో జాబ్ కోసం ఇంటర్వ్యూ కోసం తల్లిదండ్రులకు చెప్పి లావణ్యను తీసుకెళ్లాడు.

ఈ నెల 4వ తేదీన నకిలీ విమాన టిక్కెట్టును సృష్టించి  శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లోకి తీసుకొచ్చాడు. అయితే విమానం బయలుదేరే సమయానికి  సునీల్ కుమార్ వాష్ రూమ్‌కు వెళ్లారు. ఆ తర్వాత విమానం వెళ్లిపోయిందని లావణ్యను నమ్మించాడు. దీంతో చేసేది లేక ఈ నెల 4వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని లాడ్జీకి చేరుకొన్నాడు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేశారు.

ఈ నెల 5వ తేదీన తెల్లవారుజామున సునీల్‌కుమార్‌తో లావణ్య గొడవకు దిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతోనే సునీల్ కుమార్ ఆమెను గొంతు నులిమి హత్యచేశాడు. ఆ తర్వాత ట్రావెల్ బ్యాగ్‌లో లావణ్య మృతదేహన్ని తీసుకొని సూరారం కాలనీలోని చెరువులో వేశాడు.

లావణ్యను హత్య చేసిన తర్వాత ఆమె ఇంకా బతికే ఉందని నమ్మించాడు. మస్కట్‌లో ఇంటర్వ్యూ అయిందని ఇండియాకు తిరిగి వస్తున్నట్టుగా లావణ్య చేసినట్టుగానే ఆమె ఫోన్‌లోనే ఆమె చెల్లెలుతో చాటింగ్‌ చేశాడు.

లావణ్య చెల్లెలు సునీల్‌కు ఫోన్ చేసినా కూడ ఐఎస్ఢీ రీ చార్జీ చేయలేదని ఆమె ఫోన్‌ ఎత్తకుండా బీజీ అంటూ మేసేజ్ పెట్టేవాడు. ఇంటర్వ్యూ పూర్తైందని ఇండియాకు తిరిగి వచ్చినట్టుగా లావణ్య ఎప్పటికప్పుడు తన చెల్లెతో ఛాటింగ్ చేసినట్టుగా ఆమె ఫోన్‌తో చాట్ చేశాడు.

శంషాబాద్ నుండి  మియాపూర్ వరకు వచ్చే వరకు ఆమె ఫోన్ పనిచేసింది. మియాపూర్ వచ్చేవరకు లావణ్య ఫోన్ నుండి లోకేషన్‌ను  షేర్ చేసింది.  ఆ తర్వాత ఫోన్‌ను స్విఛ్చాఫ్ చేశారు. మరో వైపు సునీల్ మరునాడు మస్కట్ నుండి వస్తానని లావణ్య తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. కానీ, ఆ తర్వాత వాళ్ల ఫోన్స్ చేస్తే సమాధానం ఇవ్వలేదు. తనను కిడ్నాప్ చేశారని తప్పించుకొనే ప్రయత్నం చేశాడు.

దీంతో లావణ్య తండ్రి రామచంద్రాపురం పోలీసులకు ఈ నెల 7వ తేదీన ఫిర్యాదు చేశారు. సునీల్ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో  అసలు విషయం వెలుగు చూసింది. పోలీసుల ఫోన్లకు కూడ సునీల్ సమాధానం ఇవ్వలేదు. 

దీంతో సునీల్ ఫోన్‌ను ట్రాక్ చేసి అతను ఎక్కడ ఉన్నాడో  గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు.పోలీసులు తమదైనశైలిలో విచారణ చేస్తే  లావణ్యను హత్య చేసిన విషయాన్ని అతను బయటపెట్టాడు.సునీల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

సంబంధిత వార్తలు

టెక్కీ లావణ్య కేసు: ఇంటర్వ్యూకు తీసుకెళ్తున్నానని చెప్పి హత్య

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య: ప్రియుడే హంతకుడు