హైదరాబాద్: టెక్కీ లావాణ్యను విదేశాల్లో ఇంటర్వ్యూకు తీసుకెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీపక్ అలియాస్ సునీల్ కుమార్ ఆమెను హత్య చేశారు. తమ కూతురు నుండి ఎలాంటి సమాచారం  లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను  ఆశ్రయించడంతో ఈ హత్య విషయం  వెలుగు చూసింది.

ఈ నెల 5వ తేదీన లావణ్యను దీపక్ ఇంటి నుండి  తీసుకెళ్లాడు. శంషాబాద్‌లోని ఓ లాడ్జీలో దిగారు. లావణ్యను లాడ్జీలోనే దీపక్ హత్య చేశాడు. బట్టలు తీసుకెళ్లే బ్యాగ్‌లో లావణ్య మృతదేహాన్ని కుక్కి సూరారం వద్ద కాలువలో పారేశాడు.

లావణ్య, దీపక్‌లు కొంత కాలంగా ప్రేమించుకొంటున్నారు. పెళ్లి చేసుకోవాలని లావణ్య  సునీల్‌పై ఒత్తిడి తీసుకురావడంతో  ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతోనే  ఆమెను హత్య చేశాడు.  మూడు చోట్ల లావణ్యను హత్యచేయాలని  దీపక్ ప్లాన్ చేశాడు.  ఇందులో భాగంగానే శంషాబాద్ లాడ్జీలో హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో  ఒప్పుకొన్నారని  సమాచారం.

ఆరు రోజులు దాటినా కూడ తమ కూతురు నుండి  ఎలాంటి సమాచారం రాకపోవడంతో లావణ్య తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.

సంబంధిత వార్తలు

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య: ప్రియుడే హంతకుడు