ఐటి చెల్లింపులో ఈ లేడీ టెక్కీ రికార్డు: ఎంతో తెలుసా?

Hyderabad techie highest taxpayer with Rs 9 crore
Highlights

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు చెల్లించే ఆదాయం పన్ను చూస్తే దిమ్మతిరుగుతుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు చెందిన ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు చెల్లించే ఆదాయం పన్ను చూస్తే దిమ్మతిరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లించే వ్యక్తుల్లో ఆమె అగ్రస్థానంలో ఉంది. 

ఆమె 2017 - 18 ఆర్థిక సంవత్సరంలో రూ. 9 కోట్ల రూపాయల ఆదాయం పన్ను చెల్లించి రికార్డు సాధించింది. ఆమె ఆదాయం ఏడాదికి రూ.30 కోట్లు. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండిసీ) రూ.2,259 కోట్ల ఆదాయం పన్ను చెల్లించి కార్పోరేట్ రంగంలో అగ్రగామిగా నిలిచింది. తర్వాతి స్థానంలో ఆంధ్రబ్యాంక్ ఉంది. ఆంధ్రలోని ఎపి గ్రామీణ బ్యాంక్ కూడా అత్యధిక పన్ను చెల్లింపులు జరిపిన సంస్థల్లో ఒక్కటిగా నిలిచింది. 

అయితే, జాతీయ స్థాయిలో చూస్తే వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లించినవారిలో ఆమె కన్నా ఎక్కువ చెల్లించే వ్యక్తులు ఉన్నారు. అమర్ రాజా బాటరీస్ యజమానులు తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్, ఆయన తండ్రి గల్లా రామచంద్ర నాయుడు విజయవాడ ప్రాంతంలో అత్యధిక పన్ను చెల్లింపుదారులు,

loader