హైదరాబాద్: భార్యా పిల్లలకు విషమిచ్చి ఆ శవాల వద్దే  ఉన్న టెక్కీ ప్రదీప్ చివరకు తాను కూడ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు.  హైద్రాబాద్ హస్తినాపురంలో టెక్కీ ప్రదీప్‌తో పాటు నలుగురు మృతి చెందిన ఘటన స్థానికంగా  కలకలం రేపుతోంది.

ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరడిగొమ్మకు చెందిన  ప్రదీప్ తన భార్య స్వాతి ఇద్దరు పిల్లలతో కలిసి హైద్రాబాద్ హస్తినాపురంలో నివాసం ఉంటున్నాడు.

Also read:కరీంనగర్‌లో ఫంక్షన్‌‌కు: డాడీ సారీ అంటూ టెక్కీ ప్రదీప్ సూసైడ్ లెటర్

ఐబీఎం కంపెనీలో ప్రదీప్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే సుమారు రూ. 40 లక్షలను అప్పుగా తీసుకొచ్చి  పెట్టుబడులు పెట్టాడు. ఎక్కడ ఈ రూ. 40 లక్షలు పెట్టాడో మాత్రం ప్రదీప్ చెప్పలేదు.

శనివారం నాడు మధ్యాహ్నం నాడు స్కూల్‌ నుండి కొడుకును తీసుకొచ్చాడు ప్రదీప్. శనివారం నాడు భార్య, ఇద్దరు పిల్లలు జయకృష్ణ, కళ్యాణ్ తిన్న భోజనంలో  పురుగుల మందు కలిపి ఇచ్చాడు.ఈ భోజనం తిన్న తర్వాత ఈ ముగ్గురు మృతి చెందారు. 

భార్య స్వాతితో పాటు ఇద్దరు పిల్లల మృతదేహల వద్దే ప్రదీప్ ఉన్నాడు. ఎవరు ఫోన్ చేసినా కూడ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తండ్రితో పాటు అత్తింటి వాళ్లు పోన్ చేసినా కూడ ఫోన్ తీయలేదు.

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తమ ఇంట్లో నివాసం ఉండే మరో కుటుంబానికి కరీంనగర్ లో ఫంక్షన్‌కు వెళ్తున్నట్టుగా చెప్పారు.దీంతో  ఆ ఇంటి నుండి ఎవరూ బయటకు రాకున్నా స్థానికులు కూడ అనుమానం వ్యక్తం చేయలేదు.

స్వాతి సోదరుడు ఆదివారం నాడు రాత్రి హస్తినాపురం వచ్చి పోలీసుల సహయంతో కిటికి అద్దాలు ధ్వసం చేసి చూస్తే అసలు విషయం వెలుగు చూసింది. అసలు ప్రదీప్ రూ. 40 లక్షలు ఎక్కడ పెట్టుబడి పెట్టాడో తనకు తెలియదని కుటుంబసభ్యులు చెప్పారు.