కరీంనగర్‌లో ఫంక్షన్‌కు: డాడీ సారీ అంటూ టెక్కీ ప్రదీప్ సూసైడ్ లెటర్
కరీంనగర్ లో ఫంక్షన్ ఉంది. ఫంక్షన్‌కు వెళ్లి వస్తామని చెప్పి కానరాని లోకాలకు వెళ్లిపోయారని హైద్రాబాద్ హస్తినాపురం లో ఆత్మహత్యకు పాల్పడినన టెక్కీ ప్రదీప్ కుటుంబసభ్యులు చెబుతున్నారు.
హైదరాబాద్: కరీంనగర్ లో ఫంక్షన్ ఉంది. ఫంక్షన్‌కు వెళ్లి వస్తామని చెప్పి కానరాని లోకాలకు వెళ్లిపోయారని హైద్రాబాద్ హస్తినాపురం లో ఆత్మహత్యకు పాల్పడినన టెక్కీ ప్రదీప్ కుటుంబసభ్యులు చెబుతున్నారు.
Also read:కోట్ల ఆస్తి ఉంది.. రూ.40లక్షల కోసం ఆత్మహత్య చేసుకుంటారా..?
శనివారం నాడు మధ్యాహ్నం స్కూల్ నుండి కొడుకును ప్రదీప్ తీసుకొచ్చాడు. శనివారం నాడు సాయంత్రం లేదా రాత్రి ఈ నలుగురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
శుక్రవారం నాడు ఉదయమే దేవరకొండ సమీపంలో నివాసం ఉంటున్న తనండ్రికి ప్రదీప్ ఫోన్ చేశాడు. హైద్రాబాద్ కు రావాలని ప్రదీప్ కోరాడు. కానీ ఆయన రాలేదు. శనివారం నాడు మధ్యాహ్నం తర్వాత ఫోన్ చేస్తే ప్రదీప్ నుండి సమాధానం రాలేదు.
ఈ విషయమై ప్రదీప్ అత్తింటి వారికి కూడ ప్రదీప్ తండ్రి ఫోన్ చేశాడు.అదే సమయంలో ప్రదీప్ అత్త, మామలు శ్రీశైలం వెళ్తున్నారు. వాళ్లు కూడ ప్రదీప్ భార్య స్వాతికి ఫోన్ చేశారు. ఆమె కూడ ఫోన్ లిప్ట్ చేయడం లేదు.
మరో వైపు కరీనంనగర్‌లో పంక్షన్ ఉందని వెళ్తున్నామని కింద నివాసం ఉండే వారికి ప్రదీప్ చెప్పాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రదీప్ స్నేహితులు, బంధువులకు కూడ పోన్ చేసినా కూడ ఎలాంటి ఫలితం కన్పించలేదు.
అదే సమయంలో స్వాతి సోదరుడు హైద్రాబాద్‌కు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ప్రదీప్ నివాసం ఉంటున్న ఇంటి కిటీకీ అద్దాలు ధ్వంసం చేసి చూశారు. హల్‌లో ప్రదీప్ నిర్జీవంగా కన్పించాడు. సెంట్రల్ లాక్ ధ్వంసం చేసి ఇంట్లోకి వెళ్లి చూస్తే బెడ్‌రూమ్‌లో ఇద్దరు పిల్లలు, స్వాతి అచేతనంగా పడిఉన్నారు.
హల్‌లో ప్రదీప్ మృతదేహం పడి ఉంది. ఆత్మహత్యకు పాల్పడే ముందు తన తండ్రికి క్షమించాలని కోరుతూ ప్రదీప్ ఓ లేఖ రాశాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్న ప్రదీప్ సుమారు రూ. 40 లక్షలను అప్పుగా తెచ్చి పెట్టుబడి పెట్టాడు. అయితే ఎక్కడ పెట్టుబడి పెట్టాడనే విషయాన్ని సూసైడ్ నోటో లో రాయలేదు.
తనతో పాటు తన భార్య, పిల్లలు కూడ నీకు భారం కాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ప్రదీప్ లేఖలో పేర్కొన్నాడు. అప్పులు తెచ్చిన విషయాన్ని తనకు ప్రదీప్ చెప్పలేదన్నారు తండ్రి. ఈ విషయం తనకు తెలిస్తే తాను ఏదో పరిష్కారాన్ని ఆలోచించేవాడినని ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.