హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌కు గురైన తెలుగు టెక్కీ చరితారెడ్డి అవయవదానం చేసింది. రెండు రోజుల క్రితం మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కీ చరితారెడ్డి బ్రెయిన్ డెడ్‌కు గురైన విషయం తెలిసిందే.

Also read:అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి దుర్మరణం

బ్రెయిన్‌డెడ్‌కు గురైన చరితారెడ్డి అవయవాలను దానం చేశారు. చరితారెడ్డికి చెందిన కిడ్నీలు,  లివర్, హార్ట్‌వేవ్స్, కళ్లు దానం చేశారు.  సుమారు  తొమ్మిది మందికి చరితారెడ్డి అవయవాలను ఉపయోగించనున్నారు.

హైద్రాబాద్‌కు చెందిన చరితారెడ్డి స్నేహితులతో కలిసి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైంది..  ఈ ప్రమాదంలో చరితారెడ్డి బ్రెయిన్ డెడ్‌కు గురైంది. 

హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లోని రేణుకానగర్‌కు చెందిన ఇంద్రారెడ్డి, శోభ దంపతులకు కుమార్తె చరితారెడ్డి, కుమారుడు యశ్వంత్‌రెడ్డి ఉన్నారు.  8 నెలల క్రితం అమెరికాలోని డెలాయిట్‌ కంపెనీలో ఉద్యోగం రావడంతో చరితారెడ్డి అక్కడకు వెళ్లారు. వీకెండ్‌ కావడంతో శుక్రవారం ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో బయటకు వెళ్లారు. 

మిచిగాన్‌ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న వారి కారును వెనుక వైపు నుంచి మరో కారు ఢీకొట్టింది. కారు వెనుక సీటులో కూర్చున్న ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని అరెస్టు చేశారని మృతురాలి సోదరుడు తెలిపారు. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.