నీట్ లో మంచి ర్యాంకు రాలేదని హైదరాబాద్ లో యువతి ఆత్మహత్య (వీడియో)

hyderabad student suicide
Highlights

అబిడ్స్ మయూరి కాంప్లెక్స్ పదో అంతస్తు నుండి దూకిన యువతి

చదువుల ఒత్తిడికి మరో విద్యార్థి చిత్తయింది. ఆలిండియా లెవెల్ లో నిర్వహించే నీట్ ఎగ్జామ్ ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదని ముస్కాన్ సింగ్ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అందరూ చూస్తుండగానే అబిడ్స్ లోని మయూరి కాంప్లెక్స్ పదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.

 కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధి లోని బర్కత్ పుర ప్రాంతానికి చెందిన  ముస్కాన్ సింగ్(18) నిన్న ప్రకటించిన నీట్ పరీక్షలలో అర్హత సాధించలేదు. దీనితో మనస్తాపానికి గురైన ఆ యువతి ఇవాళ ఉదయం ద్విచక్రవాహనంపై వచ్చి అబిడ్స్ లోని మయూరి కుషాల్ భవనం  10వ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.  క్లూస్ టీం ను రప్పించి ఈ ఆత్మహత్యపై వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

వీడియో

"
 
 

loader