భాగ్యనగర్ పాలకూరలో ఐరన్ కంటే పురుగుల మందెక్కువగా ఉందట.
హైదరాబాద్ పాలకూర తింటున్నారా, అయితే ఈ విషయం ఆలోచించండి.
సమృద్ధిగా కాల్షియం, కావలసినంత ఐరన్, బోలెడు విటమిన్లు ఉన్నాయని పుస్తకాల్లో చదివి పాలకూర పప్పు, పాలకూరమటన్ ,పాలకూరు వేపుడు,పులుసు లాగించేస్తున్నారా. జాగ్రత్త.
భాగ్యనగర్ పాలకూరలో ఐరన్ కంటే పురుగుల మందెక్కువగా ఉందట.
ఇదెవరో అందుబాటులో లేని అమెరికా శాస్త్రవేత్తలు చెప్పిన విషయం కాదు, మన పక్కే, అటేపు బెంగుళూరు రోడ్ లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్శిటి పరిశోధకులు చెబుతున్నమాట. ఈ యూనివర్శిటీ లోని ఎంటమాలజీ విభాగం వాళ్ల స్టడీ లో బయటపడిన విషయం ఇది. అక్కడి పరిశోధకులు జి.గీత, సి. శ్రీనివాస్ లు గుడిమల్కాపూర్, మెహిది పట్నం, శంషాబాద్ మార్కెట్ లలో అమ్ముతున్న పాలకూర శాంపిల్స్ తీసుకుని పరీక్షిస్తే 11 రకాల పెస్టిసైడ్స్ అవశేషాలు కనిపించాయి. క్లోర్ పైరిఫోస్, ట్రయజోఫోస్, సైపర్ మెత్రిన్ అనేవి ఇందులో కొన్ని. ఈ పేర్లు మనకు అర్థంకావు కాని, ఇవ్వనీ పురుగుల మందులే.
హైదరాబాద్ లో ఉన్నవాళ్లంతా బేరమాడి కట్టలు కట్టు పాలకూర కొనేవాళ్లంతా ఏ మోతాదులోరోజూ పురుగుల మందు సేవిస్తున్నారో చూడండి.
అయితే, పాలకూరని అమ్మకుండా నిషేధించడం కష్టం. ఎందుకంటే, ఏ మోతాదు మించితే తినేవారికి ముప్పువస్తుందో ఇంకా లేక్కలు లేవు. సోయాబీన్, ఉల్లిగడ్డలు, జింజర్, పచ్చిమిరప వంటి చాలా కూరగాయలకు, కూల్ డ్రింక్స్ కు పురుగుల మందు మోతాదు (మాక్సిమమ్ రెసిడ్యూ లెవెల్ -ఎంఆర్ ఎల్) ఫిక్స్ చేసినా పాలకూర మీద ఇంకా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధారిటీ ఆప్ ఇండియా వాళ్ల కన్నుబడలేదు. అయితే, ఈ కూరగాయల మోతాదుకు మించి పాలకూరలో పురుగుల మందు మిగులు ఉందని ఈ గీత, శ్రీనివాస్ లు చెబుతున్నారు.
ఉదాహరణకు ఎప్ ఎస్ ఎస్ ఎ ఐ నియమాల ప్రకారం ఉల్లిలో క్లోర్ పైరిఫోస్ కెజికి 0.5 మి.గ్రా మించరాదు. పాలకూరలో ఇది 6.3 మి.గ్రా మించి ఉందని వీరు కనుగొన్నారు.
జర భద్రం.
