గత వారం హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో జరిగిన అగ్నిప్రమాదం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జయకృష్ణ అనే జిమ్‌ ట్రైనర్ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అయితే మొదట్లో ప్రమాదం, ఆ తర్వాత ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కానీ, పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 

వారం రోజుల క్రితం హైదరాబాద్‌‌లోని కూకట్‌పల్లిలో జరిగిన అగ్నిప్రమాదం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో జయకృష్ణ అనే జిమ్‌ ట్రైనర్‌ మరణించిన విషయం విధితమే. అయితే మొదట్లో ప్రమాదం, ఆ తర్వాత ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ, పోలీసుల విచారణలో దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్‌ వెలుగులోకి వచ్చాయి. జిమ్ ట్రైనర్‌ది ప్రమాదమో, ఆత్మహత్యో కాదని పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన దారుణం హత్య అని తేలిపోయింది. జయకృష్ణను హతమార్చింది మరెవరో కాదు.. కట్టుకున్న భార్యనేనని తేలింది. 

తన అక్రమ సంబంధానికి కట్టుకున్నవాడు అడ్డుగా ఉన్నాడనీ, ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా చంపించింది. అగ్నిప్రమాదంలో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. మృతుడి తండ్రి ఫిర్యాదు ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 

వివరాల్లోకెళ్లే.. జిమ్ ట్రైనర్ జయకృష్ణ భార్య దుర్గా.. గత ఏడాది నుంచి చిన్నా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే..వీళ్లిదరి బాగోతం జయకృష్ణ కంటబడింది. ఈ విషయమై భార్యను మందలించాడు జయకృష్ణ. అలాంటి పిచ్చి వేషాలు వేస్తే.. కుదరదని.. తమ స్వస్థలమైన కృష్ణా జిల్లాకు వెళ్లిపోదామని ఒత్తిడి తీసుకొచ్చాడు.

దీంతో తమ బంధానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా తొలగించాలని దుర్గా తన ప్రియుడితో కలిసి కన్నింగ్ ప్లాన్‌ వేసింది. భర్త అడ్డు తొలగించుకుంటే.. ఇద్దరు కలిసి ఉండొచ్చని ప్లాన్ వేసింది. పీకలదాకా మద్యం తాగించి సజీవ దహనం చేసి.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించాలని మాస్టర్ ప్లాన్ వేసింది. 

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే దుర్గా తన తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. అయితే.. తన ప్రియుడు చిన్నా, తన భర్తతో సిట్టింగ్ వేసేలా ప్లాన్ చేసింది. అంతకు ముందు వీరిద్దరూ స్నేహితులు కావడంతో తరుచు కలిసి తాగేవారు. ఎప్పటిలాగానే జయకృష్ణతో కలిసి మందు తాగటం మొదలుపెట్టారు. వాళ్లిద్దరి మీద కోపంతోనో.. బాధతోనో.. జయకృష్ణ పీకలదాకా మద్యం తాగేశాడు. అనంతరం మత్తులో జరుగుకున్న జయకృష్ణను బెడ్ రూంలో పడుకోబెట్టాడు చిన్నా. అప్పుడు .. చిన్నా తన ప్రియురాలైన దుర్గకు వీడియో కాల్ చేశాడు.

మద్యం మత్తులో ఉన్న భర్త జయకృష్ణను చూపించాడు. తాను లైవ్ లో చూస్తుండగా.. తన భర్త జయకృష్ణను చంపాలని దుర్గా కోరింది. అనుకున్న ప్లాన్ ప్రకారం.. జయకృష్ణ ఒంటి మీద పెట్రోల్ చల్లాడు. అయితే... ఆ తర్వాత దుర్గా తన ప్రియుడు చిన్నాకు సలహాలు కూడా ఇచ్చింది. జయకృష్ణను సజీవదహనం చేస్తుండగా చూసి భార్య దుర్గా ఆనందపడింది. చివరికి జయకృష్ణ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు వదిలాడు.