హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్‌) నగరాల జాబితాలో ప్రపంచం లోనే మొదటి స్థానంలో నిలిచింది. 

ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ 2020 కి గాను మోస్ట్‌ డైనమిక్‌ సిటీ గా హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.

Also read:కేసీఆర్ పై ఫైట్: తెలంగాణలోనూ బిజెపి ఆస్త్రం పవన్ కల్యాణ్

 ఈ మేరకు సిటీ మూమెంటం ఇండెక్స్‌-2020 జాబితాను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ జాబితాలో మొదటి 20 స్థానాల్లో భారత్‌ కు చెందినవే 7 నగరాలు ఉండడం గమనార్హం. భారత్‌ నుంచి చెన్నై (5వ స్థానం), దిల్లీ (7వ స్థానం), పుణె (12వ స్థానం), కోల్‌కతా (16వ స్థానం), ముంబయి (20వ స్థానం) ఈ జాబితాలో ఉన్నాయి.

Also read:మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తాం: జనసేన, బీజేపీ పొత్తుపై కేటీఆర్ ఇలా..


2014లో జేఎల్‌ఎల్‌ విడుదలచేసిన సిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్‌కు టాప్‌-20లో చోటు లభించలేదు. ఆ మరుసటి ఏడాదే టాప్‌-20లో చేరిన హైదరాబాద్‌.. అప్పటినుంచి తన స్థానాన్ని మెరుగుపరుచుకొని 2016లో ఐదో స్థానానికి 2017లో మూడో స్థానానికి చేరింది. 2018లో హైద్రాబాద్ అగ్రస్థానానికి ఎగబాకింది. గతేడాది ఈ సూచీలో హైదరాబాద్‌ రెండో స్థానానికి పడిపోయినా ఈ ఏడాది మళ్లీ మొదటిస్థానం దక్కించుకున్నది.

ఈ ఏడాది విశ్వవ్యాప్తంగా ఏ నగరాన్ని గమనించినా హైదరాబాద్‌లోనే ఆఫీసు సముదాయాల లీజింగ్‌ కార్యకలాపాలు అత్యధికంగా నమోదయ్యాయి. ఆఫీసు స్థలాల అద్దెలూ క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

ప్రపంచ ఐటీ దిగ్గజాలైన అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌ లాంటి పలు సంస్థలు తమ కార్యకలాపాల కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడంతో అనేక అంతర్జాతీయ సం స్థలు మన హైద్రాబాద్ పై దృష్టిపెట్టాయి.

 షాంఘై, షెన్‌జెన్‌ లాంటి ఆర్థిక వ్యవస్థలను హైదరాబాద్‌ అందిపుచ్చుకొంటుందని జేఎల్‌ఎల్‌ ప్రకటించింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, సానుకూల వ్యాపార వాతావరణం, స్టార్టప్‌లను ప్రోత్సహించే వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలే ఇందుకు ప్రధాన కారణం. 

వీటికితోడు మెట్రోమా ర్గాలు అందుబాటులోకి వస్తుండటం, విమానాశ్రయ సామర్థ్యాన్ని పెంచడం, స్మార్ట్‌ బైకులు, ఈ-ఆటోల్ని ప్రవేశపెట్టడం లాంటి అంశాలతో హైదరాబాద్‌ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జిస్తున్నది.

2015లో టీహబ్‌ను ప్రారంభించి స్టార్టప్‌లకు కొత్త ప్రోత్సాహాన్ని ఇవ్వడంవల్లే ఇన్నోవేషన్‌ రంగంలో హైదరాబాద్‌ ప్రఖ్యాత షెన్‌జెన్‌, షాంఘై లాంటి నగరాలతో పోటీపడే స్థాయికి చేరిందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయాల గిరాకీ 50 శాతం పెరిగిందని, 20 నుంచి 40 ఏండ్ల వయసు యువకులు ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ ప్రథమస్థానంలో నిలిచిందని, దీన్ని ‘ఇంజిన్‌ రూమ్‌ పాప్యులేషన్‌' అంటారని తెలిపారు. 

హైదరాబాద్‌లో దాదాపు 40 శాతం జనాభా 20 నుంచి 40 ఏండ్లలోపువారేనని, ఇది హైదరాబాద్‌ను ఇన్నోవేషన్‌ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎంతో తోడ్పడుతుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, జేఎల్‌ఎల్‌ కంట్రీ హెడ్‌ అరుణ్‌నాయర్‌ తదితరులు పాల్గొన్నారు.