స్టూడెంట్‌తో‌ పెళ్లి: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన హెడ్మాస్టర్

Hyderabad: Principal absconding after sexually assaulting minor girl held
Highlights

విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన ప్రధానోపాధ్యాయుడే వక్ర మార్గం పట్టాడు. తాను పనిచేసే స్కూల్ విద్యార్ధిని మోసం చేసి పెళ్లి చేసుకొన్నాడు.  ఆమెతో శారీరక సంబంధం తీర్చుకొన్నాడు. 


శంషాబాద్: విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చి దిద్దాల్సిన ప్రధానోపాధ్యాయుడే వక్ర మార్గం పట్టాడు. తాను పనిచేసే స్కూల్ విద్యార్ధిని మోసం చేసి పెళ్లి చేసుకొన్నాడు.  ఆమెతో శారీరక సంబంధం తీర్చుకొన్నాడు.  మోజు తీరాక  వదిపెట్టాడు.  ఈ విషయమై బాధితురాలు  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని   సుమారు రెండు మాసాల తర్వాత  పోలీసులు అరెస్ట్ చేశారు.

శంషాబాద్ మండలపరిధిలోని ముచ్చింతల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా 50 ఏళ్ల అక్బర్ పనిచేస్తున్నాడు. అక్బర్ అదే స్కూల్‌లో చదువుతున్న ఓ విద్యార్థిని  మోసం చేసి పెళ్లి చేసుకొన్నాడు. ఈ విషయమై బాధిత కుటుంబం  ఈ ఏడాది మే 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు నిందితుడి కోసం  గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, రెండు మాసాల నుండి  అక్బర్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అప్పటి నుండి నిందితుడు కర్ణాటకలో తలదాచుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు.  అతడిని  అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమాచారాన్ని అక్బర్  బంధువు ఇమ్రాన్ ఇచ్చాడు.

దీంతో  అక్బర్  హైద్రాబాద్‌కు పారిపోయి వచ్చాడు. ఈ విషయాన్ని గుర్తించిన  పోలీసులు  నిందితుడిని షాబాద్‌లో అరెస్ట్ చేశారు.  అక్బర్ తో పాటు  అతని అల్లుడు ఇమ్రాన్ ను కూడ అరెస్ట్ చేసినట్టు చెప్పారు. నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు శంషాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ తెలిపారు.

పదోతరగతి పూరైన తర్వాత ఇంటర్, డిగ్రీ చదివేందుకు  అవసరమైన సహాయం చేస్తానని అక్బర్  బాధితురాలిని నమ్మించాడు. ఈ క్రమంలోనే తొలుత కాలేజీల్లో ఆడ్మిషన్ విషయంలో ఆమెకు సహకరిచాడు. ఆ తర్వాత ఒక రోజు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అయితే తాను ఆమెను పెళ్లి చేసుకొంటానని నమ్మించాడు.ఆమె కూడ మిన్నకుంది. గోల్కొండ కోటలో బాధితురాలికి తాళి కట్టాడు. దీంతో అతడి నిందితుడికి లైసెన్స్ లభించినట్టైంది. అయితే ఒక రోజు కూతురు మెడలో ఉన్న తాళిని, బ్యాగులో ఉన్న బంగారు ఉంగరాన్ని తల్లి చూసింది.ఈ విషయమై నిలదీస్తే ఆ బాలిక అన్ని విషయాలను చెప్పింది. దీంతో బాధిత కుటుంబం  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు  అక్బర్ కోసం  రెండు మాసాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శనివారం సాయంత్రం నిందితుడు పోలీసులకు చిక్కాడు.  నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. 


 

loader