Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌కు ఆల్‌ఖైదా ఉగ్రవాది జుబేర్: కాంటాక్టులు, సోషల్ మీడియా పోస్టులపై ఆరా

ఆల్‌ఖైదా ఉగ్రవాది జుబేర్‌ను అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చారు. మంగళవారం ఆల్వాల్‌లోని అతని ఇంటికి తీసుకొచ్చారు. ఆల్‌ఖైదాకు నిధులు సేకరించారన్న ఆరోపణలపై జుబేర్‌ను అరెస్ట్ చేశారు

hyderabad police take Terrorist zubair ahmed ibrahim in custody
Author
Hyderabad, First Published May 26, 2020, 6:45 PM IST

ఆల్‌ఖైదా ఉగ్రవాది జుబేర్‌ను అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చారు. మంగళవారం ఆల్వాల్‌లోని అతని ఇంటికి తీసుకొచ్చారు. ఆల్‌ఖైదాకు నిధులు సేకరించారన్న ఆరోపణలపై జుబేర్‌ను అరెస్ట్ చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా జుబేర్ ఫోన్ కాంటాక్టులు, సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు దృష్టి సారించారు. యూఏఈలో జన్మించిన జుబేర్ మహ్మద్.. 1984లో హైదరాబాద్‌కు వచ్చినట్లుగా తెలుస్తోంది.

2001లో ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చదివాడు. అనంతరం అమెరికా వెళ్లి.. అక్కడి నుంచి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఆల్‌ఖైదాకు నిధులు సమకూర్చాడు. పలు ఉగ్రవాద కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జుబేర్‌ 2015లో అమెరికాలో పోలీసులకు చిక్కాడు.

అక్కడి కోర్టుల్లో జుబేర్‌పై ఉన్న అభియోగాలు నిజమేనని తేలడంతో అమెరికాలో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం భారత్‌కు పంపించింది. అయితే లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం జుబేర్‌ను అమృతసర్‌లోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచి 14 రోజుల తర్వాత హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios