హైదరాబాద్: హైద్రాబాద్ శివారులోని షామీర్‌పేటలో ఓ కారులో భారీగా నగదును తరలిస్తుండగా  మఫ్టీ పోలీసులు సోమవారం నాడు సాయంత్రం పట్టుకొన్నారు.

పోలీసులు కచ్చితమైన సమాచారం అందడంతో మఫ్టీలో పోలీసులు  కారును ఆపారు. కారులో భారీగా నగదును పోలీసులు గుర్తించారు.కారును పోలీసులు షామీర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ డబ్బును ఎవరు ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఇటీవల కాలంలో హవాలా డబ్బును హైద్రాబాద్ పోలీసులు  స్వాధీనం చేసుకొన్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో హైద్రాబాద్ నుండే డబ్బులను పంపినట్టుగా పోలీసులు గుర్తించారు.

హైద్రాబాద్ కేంద్రంగా హవాలా రాకెట్ ను కొందరు కొనసాగిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. హవాలా రాకెట్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో దొరికిన డబ్బులపై కూడ హైద్రాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఇవాళ షామీర్ పేటలో పోలీసులు స్వాధీనం చేసుకొన్న డబ్బులు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయి.. ఈ డబ్బులు ఎవరివనే విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.