Hyderabad: ట్రోల్ ఛానళ్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం మోపారు. ట్రోలర్స్ కు చెక్ పెట్టే క్రమంలో ఇప్పటివరకు 20 కేసులు నమోదుచేశారు. ఈ 'ట్రోలర్స్'లో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకులేననీ, వారు చదువుకుంటున్న వారు కొందరు ఉండగా, పలువురు మధ్యలో ఆపేసిన వారు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.
Police crackdown on ‘troll’ channels: ట్రోల్ ఛానళ్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం మోపారు. ట్రోలర్స్ కు చెక్ పెట్టే క్రమంలో ఇప్పటివరకు 20 కేసులు నమోదుచేశారు. ఈ 'ట్రోలర్స్'లో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకులేననీ, వారు చదువుకుంటున్న వారు కొందరు ఉండగా, పలువురు మధ్యలో ఆపేసిన వారు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. ఆన్ లైన్ లో ట్రోల్ ఛానళ్లపై ఉక్కుపాదం మోపిన హైదరాబాద్ పోలీసులు 20 కేసులు నమోదు చేశారు. సబ్‌స్క్రైబర్‌లను పెంచుకోవడం, తద్వారా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు యువకులు కొందరు ప్రజాప్రతినిధులపై మార్ఫింగ్ వీడియోలతో అభ్యంతరకర, పరువు నష్టం కలిగించే కంటెంట్ ను పోస్ట్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఐపీసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద పలు శిక్షార్హమైన సెక్షన్లు ఉంటాయని తెలిపారు. సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవడానికి నిందితులు కొన్నిసార్లు మహిళల ప్రాథమిక 'హుందాతనాన్ని' దెబ్బతీసే కంటెంట్ ను పోస్ట్ చేస్తున్నారని నగర పోలీసులు తెలిపారు.
పలువురు ప్రజాప్రతినిధులపై అభ్యంతరకర, పరువు నష్టం కలిగించే, అవమానకరమైన మార్ఫింగ్ వీడియోలను ప్రసారం చేస్తున్న వివిధ ట్రోలింగ్ ఛానళ్ల యజమానులు/ అప్ లోడర్లపై ఇటీవల 20 కేసులు నమోదు చేశామనీ ఎనిమిది మందిని గుర్తించామనీ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ 'ట్రోలర్స్'లో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకులేననీ, వారు చదువుకుంటున్న వారు కొందరు ఉండగా, పలువురు మధ్యలో ఆపేసిన వారు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. దీర్ఘకాలంలో ఇలాంటి ఆకర్షణ, ట్రోలింగ్ వ్యామోహం యువతలో అరాచకానికి దారితీస్తుందని పోలీసులు వ్యాఖ్యానించారు.
