హైద్రాబాద్‌కు చంద్రబాబు, ర్యాలీ: టీడీపీ నేతపై కేసు నమోదు

టీడీపీ నేతలను కేసులు వీడడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు  తెలంగాణలో కూడ  టీడీపీ నేతలపై  కేసులు నమోదౌతున్నాయి. 

Hyderabad Police Files case against  TDP Leader  GV naidu for violation Election code lns

 


హైదరాబాద్:  అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు గాను  హైద్రాబాద్ బేగంపేట పోలీసులు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు.విజయవాడ నుండి నిన్న ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుండి  చంద్రబాబునాయుడు జూబ్లీహిల్స్ నివాసానికి  చంద్రబాబు కాన్వాయ్ వెంట టీడీపీ శ్రేణులు, అభిమానులు ర్యాలీగా వెళ్లారు.

దీంతో  బేగంపేట నుండి జూబ్లీహిల్స్ వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.  ఎలాంటి అనుమతి లేకుండా  చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే సమయంలో  ర్యాలీ నిర్వహించారని టీడీపీ నేతపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో  ర్యాలీలు, సభలు, సమావేశాలకు  అనుమతి తప్పనిసరి. కానీ ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని  పోలీసులు  కేసు నమోదు చేశారు. టీడీపీ హైద్రాబాద్ నగర కార్యదర్శి జీవీ నాయుడిపై పోలీసులు కేసు పెట్టారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు.ఈ కేసులో జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు  రెండు రోజుల క్రితం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ రావడంతో చంద్రబాబు  రాజమండ్రి జైల నుండి విడుదలయ్యారు. నిన్న సాయంత్రం  విజయవాడ నుండి హైద్రాబాద్  చంద్రబాబు వచ్చారు.

also read:హైద్రాబాద్ ఎఐజీ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు: పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

ఇవాళ ఉదయం  చంద్రబాబు నాయుడు  ఎఐజీ ఆసుపత్రికి వెళ్లారు.  వైద్య పరీక్షల కోసం  ఆసుపత్రిలో వైద్యుల ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల  30  పోలింగ్ జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీ పోటీ చేయడం లేదు.  తొలుత పోటీ చేయాలని టీడీపీ భావించింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, చంద్రబాబు సహా పార్టీ నేతలపై  కేసుల దృష్ట్యా తెలంగాణలో  ఎన్నికలపై ఫోకస్ పెట్టలేమని  టీడీపీ భావించింది. దీంతో  ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అసంతృప్తికి గురైన  టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  కాసాని జ్ఞానేశ్వర్  టీడీపీకి, టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios