Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ ఘట్ కేసర్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినుల ఫోటోలు మార్ఫింగ్: పోలీసుల అదుపులో ఒకరు

ఘట్ కేసర్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినుల  ఫోటోలు మార్ఫింగ్  చేసిన ఘటనపై  పోలీసులు  దర్యాప్తును మరింత  ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం   గాలింపు చర్యలు చేపట్టారు.

Hyderabad Police  Detained  Pradeep in   Engineering  Girl Students  Photos  morphing Case
Author
First Published Jan 6, 2023, 9:30 AM IST

హైదరాబాద్: నగర శివారులో ఘట్ కేసర్ ఇంజనీరింగ్  కాలేజీ  విద్యార్ధినుల ఫోటోలను  మార్ఫింగ్ చేసిన ఘటనకు సంబంధించి  ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరో నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  .  విద్యార్ధినుల ఫోన్లను  హ్యాకింగ్  చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న  43 మంది విద్యార్ధినుల ఫోన్లను  నిందితులు హ్యాకింగ్ చేసి ఈ మొబైళ్లలో  ఉన్న ఫోటోలను   మార్ఫింగ్  చేసి  విద్యార్ధినులను బ్లాక్ మెయిల్  చేస్తున్నారు.  ఈ విషయమై  విద్యార్ధినులు  కాలేజీ  ముందు ఆందోళనకు కూడా దిగారు.  అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు  నాలుగు బృందాలుగా  ఏర్పడి దర్యాప్తు  చేస్తున్నారు. విద్యార్ధినుల ఫోటోల మార్పింగ్ అంశానికి సంబంధించి  విచారణ నిర్వహిస్తున్న సమయంలో  తమను పట్టుకోవాలని నిందితులు  పోలీసులకు సవాల్ విసిరారు. ఈ  మేరకు  పోలీసులకు  మేసేజ్ పంపారు.   దీంతో పోలీసులు ఈ కేసును మరింత లోతుగా  దర్యాప్తు  చేస్తున్నారు. విద్యార్ధినుల ఫోటోలను మార్పింగ్  చేసిన  నిందితుల్లో ప్రదీఫ్ అనే యువకుడిని  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.ప్రదీప్ తో పాటు  మరో నలుగురు ఈ ఘటనలో  ఉన్నారని పోలీసులు గుర్తించారు. మిగిలిన నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  విద్యార్ధినుల ఫోటోలు మార్పింగ్ చేసిన వారు   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  విజయవాడ, తూర్పు గోదావరి జిల్లాలకు  చెందిన వారిగా  పోలీసులు  గుర్తించారు. 

also read:హైద్రాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం: విద్యార్ధినుల ఫోటోలు న్యూడ్ గా మార్ఫింగ్, పోలీసుల దర్యాప్తు

విధ్యార్ధినుల ఫోటోలు  మార్ఫింగ్ అంశంతో  పేరేంట్స్, విద్యార్ధి సంఘాలు నిన్న  కాలేజీ ముందు ఆందోళనకు దిగాయి. ఆ ఆందోళన నేపథ్యంలో   కాలేజీకి సంక్రాంతి సెలవులు ప్రకటించింది  యాజమాన్యం.  దీంతో హస్టల్ లో  ఉంటున్న  విద్యార్ధులు  తమ స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు.  ఈ విషయమై  తాము పట్టించుకోవడం లేదనే  ఆరోపణలను కాలేజీ యాజమాన్యం తోసిపుచ్చింది.  తమ దృష్టికి విద్యార్ధినులు  విషయం తీసుకు రాగానే  పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా కాలేజీ యాజమాన్యం  ప్రకటించింది. రెండు వాట్సాప్ గ్రూప్ లను  హ్యాకర్లు ఏర్పాటు చేశారని పోలీసులు గుర్తించారు. కింగ్ ీజ్ బ్యాక్,  ఎంటర్ ది డ్రాగన్ పేరుతో  రెండు వాట్సాప్ గ్రూప్  లలో  మార్ఫింగ్  ఫోటోలను  పోస్టు చేశారని  సమాచారం.  ప్రదీప్, గణేస్ అనే ఇద్దరిని  ఈ వాట్సాప్ గ్రూప్ ల వెనుక ఉన్నారని  పోలీసులు గుర్తించారు. ఇప్పటికే  ప్రదీప్ ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios