Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం: విద్యార్ధినుల ఫోటోలు న్యూడ్ గా మార్ఫింగ్, పోలీసుల దర్యాప్తు

హైద్రాబాద్ ఘట్ కేసర్ లో గట ఇంజనీరింగ్  కాలేజీలో  విద్యార్ధినుల  ఫోటోలను    మార్ఫింగ్  చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.  

Hyderabad Police investigating  on Engineering girl student photo morphing case
Author
First Published Jan 5, 2023, 12:43 PM IST

హైదరాబాద్: నగరంలోని ఘట్ కేసర్  లో గల ఓ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినుల ఫోటోలను న్యూడ్ గా  మార్ఫింగ్  చేసి వాట్సాప్ లలో  పోస్టు చేసిన ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేశారు.  ఈ విషయమై  విద్యార్ధినులు కాలేజీ  ముందు  ఆందోళనకు దిగారు. విద్యార్ధినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి  వాట్సాప్ గ్రూప్ లో  పోస్టు చేస్తున్నారని  బాధితులు  ఆరోపిస్తున్నారు.ఈ విషయమై విద్యార్ధినులు  పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. ఇవాళ కాలేజీకి వెళ్లిన పోలీసులు ఈ విషయమై ఆరా తీస్తున్నారు. వాట్సాప్ గ్రూపును  ఇతర రాష్ట్రాల నుండి ఆపరేట్ చేస్తున్నారని  పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ విషయమై   నాలుగు  పోలీస్ బృందాలు  విచారణ చేస్తున్నారు. కొంత కాలంగా విద్యార్ధినులకు  బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నట్టుగా  పోలీసులకు  బాధిత విద్యార్ధులు  ఫిర్యాదు చేశారు. ఈ కాలేజీలోని కొందరు విద్యార్ధులపై  బాధిత విద్యార్ధినులు అనుమానం వ్యక్తం చేశారు. అనుమానిత విద్యార్ధినులను  పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  

విద్యార్ధి సంఘాల ఆందోళన

ఘట్ కేసర్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినుల  ఫోటోలను మార్ఫింగ్  చేసిన విషయం తెలుసుకున్న విద్యార్ధి సంఘాలు  ఇవాళ  కాలేజీ గేటు ముందు  ఆందోళనకు దిగారు.ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు  అరెస్ట్  చేశారు.  విద్యార్ధి సంఘాల నేతలు  పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.   మరో వైపు  కాలేజీలో  ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్న సమయంలోనే  బెదిరింపు కాల్స్ వచ్చాయి. విద్యార్ధినులకు  లింక్స్ పంపి తమ వాట్సాప్  గ్రూప్ ల్లో చేరాలని బెదిరించారు.  వారం రోజులుగా  విద్యార్ధినుల ఫోటోలు మార్ఫింగ్  జరుగుతున్నా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదని పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు  విచారణ నిర్వహిస్తున్నారు.విద్యార్ధినుల  ఫోటోల మార్ఫింగ్ ఘటనపై  పేరేంట్స్ ఆందోళన చెందుతున్నారు.  నిందితులను   గుర్తించి కఠినంగా  శిక్షించాలని  పేరేంట్స్  కోరుతున్నారు.

మా దృష్టికి రాగానే   పోలీసులకు ఫిర్యాదు చేశాం: కాలేజీ యాజమాన్యం

విద్యార్ధినుల ఫోటోలను మార్ఫింగ్  చేస్తున్న విషయాన్ని తమ దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా  కాలేజీ యాజమాన్యం ప్రకటించింది.  తమ కాలేజీలో చదువుతున్న 15 నుండి  20 మంది విద్యార్ధినులకు  ఇలా ఫోన్లు  వచ్చినట్టుగా తమ దృష్టికి వచ్చిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది.  విద్యార్ధినుల ఫోటోల మార్ఫింగ్  విషయాన్ని పట్టించుకోలేదని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని  కాలేజీ యాజమాన్యం ప్రకటించింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios