ఆన్‌లైన్‌లో ఉగ్ర సంస్థ ఐసిస్ పేరుతో ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

ఆన్‌లైన్‌లో ఉగ్ర సంస్థ ఐసిస్ పేరుతో ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సులేమాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఐసిస్ తీవ్రవాదంపై ప్రచారం చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో పోస్టులు పెడుతూ ప్రచారం సాగిస్తున్నాడు. యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే విధంగా ప్రచారం చేస్తున్నాడు. సులేమాన్‌ను హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా సులేమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.