రు. 500 ఫైన్ కట్టిన తెలంగాణా ఎమ్మెల్యే యాదయ్య

Hyderabad police collect fine from MLA for tinted car glass film
Highlights

హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టిన తొలి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే యాదయ్య కుపేరు వచ్చింది. కారు అద్దాలకు ఫిల్మ్ తీయకుండా ఝామ్మని వెళ్తున్న యాదయ్య కారును పోలీసులు పట్టుకున్నారు. ఫైన్ వేశారు. ఎమ్మెల్యే అని చెబుతున్నాసరే,   రచ్చ వద్దు, ఫైన్ కట్టి వెళ్లమన్నారు. 

 

కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ అంటించి  నియమాలను ఉల్లంఘించి తిరుగుతున్న  చేవెళ్ల కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యే కాలె యాదయ్య హైదరాబాద్ పోలీసుల కంట పడ్డారు. పోలీసులు కారాపారు.ఛలాన్ అన్నారు. బహుశా హైదరాబాద్ లో ఒక ఎమ్మెల్యే కారాపి ఇలా జరిమానా విధించిన సంఘటన ఇదే కావచ్చు. యాదయ్య ముహూర్తం బాగాలేదు. పోలీసులు కూడా ఎమ్మెల్యే అని  వదిలేయలేదు. 


అద్దాలకు ఫిల్మ్ తొలిగించనందుకు  మాదా పూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు మొత్తానికి  రు. 500 జరి మానా విధించారు.

 

నానక్‌ రాంగూడ సమీపంలోని టోల్‌ గేట్‌ వద్ద గురువారం పెట్రోల్‌ వాహనాల ప్రారంభోత్సవ హడావుడి  మొదలయింది పోలీసులు చాలా హుశారుగా ఉన్నారు.  మీడియా కూడా భారీ గా  మొహరించి ఉంది. ఇదే యాదయ్య ఈ పరిస్థితి తీసుకువచ్చింది.


సరిగ్గా  అపుడే గచ్చిబౌలి వైపు నుంచి నానక్‌ రాంగూడ టోల్‌ గేట్‌ వైపు ఈ కా రు వచ్చింది. చక్కగా అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ అంటించి ఉన్న కారు మెల్లిగా వస్తున్నది.  ఇది  సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ కంటపడింది. దీంతో ఆయన ట్రాఫిక్‌ పోలీసు లను శ్రీనివాస్‌ అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే కారు అయినా సరే ఆపేయండని చెప్పారు.  ఎస్‌ఐ విజయ్‌ మోహన్‌ కారును టోల్‌ గేట్‌లో ఆపేశారు. తాను ఎమ్మెల్యేనని యాదయ్య చెప్పి బయటపడే ప్రయత్నం చేశారు. అయితే,  మీడియా ప్రతినిధులు ఉన్నారు,  వదిలిపెట్టడితే  రచ్చ రచ్చ అవుతుందని, కుదరదని చెప్పారు.  మీడియా రచ్చకంటే,  జరిమానా కట్టి హుందాగో పోతే నే మంచిదని  ఎమ్మెల్యే యాదయ్య భావించారు. వెంటనే  రూ.500 చలానా చెల్లించి చేవెళ్లకు బయలుదేరి వెళ్లారు. 

 

loader