Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో మరో చైనా కంపెనీ మోసం: ముగ్గురు అరెస్ట్

హైద్రాబాద్‌లో మరో చైనా కంపెనీ మోసానికి పాల్పడింది.  హైద్రాబాద్ కు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసి భారీగా పెట్టుబడులను వసూలు చేశారని సీసీఎస్ పోలీసులు తెలిపారు.

Hyderabad police arrested Three for cheating with fake companies
Author
Hyderabad, First Published Dec 24, 2021, 1:18 PM IST


హైదరాబాద్:  Hyderabad లో మరో China కంపెనీ మోసానికి పాల్పడింది. ఈ మేరకు Roc ప్రతినిధులుCCS పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైద్రాబాద్ వాసులతో 12 నకిలీ కంపెనీలను చైనా ప్రతినిధులు సృష్టించారు.  ఈ కంపెనీల ద్వారా  Fake  బ్యాంకు ఖాతాలను తెరిచారు. అధిక లాభాలను చూపి పెట్టుబడుల రూపంలో డబ్బులు వసూలు చేశారని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. కోట్లాది రూపాయాలను వసూలు చేసి చైనాకు డబ్బులను తరలించారని పోలీసులు గుర్తించారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు 
హైద్రాబాద్ కు చెందిన శ్రీనివాసరావు, విజయకృష్ణ, విజయభాస్కర్ రెడ్డి లను పోలీసులు అరెస్ట్ చేశారు.గతంలో కూడా Online  రుణాల పేరుతో చైనాకు చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున నిధులను తరలించినట్టుగా హైద్రాబాద్ కు చెందిన సీసీఎస్ పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు.

రుణాల పేరుతో మరోసారి డబ్బులు వసూలు చేస్తున్న కేసులు వెలుగు చూశాయి. తాజాగా వారం  రోజుల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి.  హైద్రాబాద్ నగరంలోని Yousufguda కు చెందిన యువతి ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా రూ. 10 లక్షల రుణం తీసుకొంది. అయితే లోన్ యాప్ నిర్వాహకులు యువతిని వేధింపులకు గురి చేశారు. దీంతో ఆ యువతి తాను తీసుకొన్న రూ. 10 లక్షలకు అదనంగా రూ. 2.9 లక్షలు చెల్లించింది.  నగరంలోని కృష్ణానగర్ లో కూడా ఇదే తరహలో మరో కేసు కూడా నమోదైంది. ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా ఓ మహిళా రూ. 33 వేలు రుణం తీసుకొంది.  దీంతో ఆ యువతిని డబ్బులు చెల్లించాలని ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. 

also read:హైద్రాబాద్‌‌‌లో మరోసారి ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు: వారంలో నాలుగు కేసులు నమోదు

ఫేక్ లెటర్ హెడ్ తో బ్లాక్ మెయిల్ చేశారు కాల్ సెంటర్ నిర్వాహకులు. బాధిత యువతి కుటుంబీకుల ఫోన్ నెంబర్లను తీసుకొని వాట్సాప్ గ్రూప్ తయారు చేసి బాధితురాలిని వేధింపులకు గురి చేశారు నిందితులు. ఈ వేధింపులు తాళలేక బాధితురాలు రూ. 33 వేలకు గాను లక్ష రూపాయాలను చెల్లించింది. హైద్రాబాద్  పాతబస్తీ కి చెందిన ఆటో డ్రైవర్ గో క్యాష్ యాప్ ద్వారా  రూ. 5 వేల లోన్ తీసుకొన్నాడు ఆన్‌లైన్ యాప్ ద్వారా లోన్ కోసం ధరఖాస్తు చేసుకొనే సమయంలో తెలియక అన్ని నిబంధనలను ఆటో డ్రైవర్ యాక్సెప్ట్ చేశాడు.దీంతో ఆటో డ్రైవర్ ను లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు.ఈ వేధింపులు భరించలేక  బాధితుడు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఇదే తరహలో మరొకరు కూడా వేధింపులకు గురైనట్టుగా పోలీసులకు పిర్యాదు అందింది.

ఆన్‌లైన్ లోన్‌యాప్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాల నుండి డబ్బులను డ్రా చేసుకొనేందుకుగాను చైనా కేటుగాళ్లు అనిల్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొన్నారు.నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తిన అనిల్ ను పోలీసులు  ఇటీవల అరెస్ట్ చేశారు. అనిల్‌ను  విచారణ చేస్తే కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆన్‌లైన్ యాప్ కేసులో పోలీసులు  ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను నకిలీ ఎస్ఐ అనిల్ డీఫ్రీజ్ చేయించారు. కోల్‌కత్తాలోని ఐసీఐసీఐ బ్యాంకుకు డీఫ్రీజ్ చేయాలని అనిల్ రాసిన లేఖ ఆధారంగా  బ్యాంకు అధికారులు ఈ ఖాతాలోని నిధులను మరో బ్యాంకు ఖాతాలోకి మళ్లించారు.

Follow Us:
Download App:
  • android
  • ios