Asianet News TeluguAsianet News Telugu

వరదనీటిలో గల్లంతు: కిలో బంగారం మాయం, బ్యాగ్ లభ్యం

నగరంలోని బంజారాహిల్స్ లో ఈ నెల 9వ తేదీన  వరదలో కొట్టుకుపోయిన నగల బ్యాగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 1 కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు.
 

Hyderabad police arrested Four persons for gold ornaments bag missing case lns
Author
Hyderabad, First Published Oct 22, 2020, 3:20 PM IST


హైదరాబాద్:  నగరంలోని బంజారాహిల్స్ లో ఈ నెల 9వ తేదీన  వరదలో కొట్టుకుపోయిన నగల బ్యాగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 1 కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు.

also read:హైద్రాబాద్ వరద నీటిలో కొట్టుకుపోయిన కిలోన్నర బంగారం: గంటల తర్వాత దొరికింది

ఓ కస్టమర్ కు బంగారు ఆభరణాలను చూపించేందుకు ఓ జ్యూయలరీ సంస్థలో  పనిచేస్తున్న సేల్స్ మెన్ బైక్ పై నగల బ్యాగ్ పెట్టుకొని వచ్చాడు.అయితే  నగల బ్యాగ్ వరదలో కొట్టుకుపోయిందని ఆయన యజమానికి ఫిర్యాదు చేశాడు. ఈ నగల షాపులో పనిచేసే ఇతర సిబ్బంది, పోలీసులు కూడ వరద నీటిలో నగల బ్యాగ్ కోసం గాలించారు.

ఈ నెల 10వ తేదీన నగల బ్యాగు లభ్యమైంది. అయితే ఈ బ్యాగులో నగలు లేకపోవడం మరింత  అనుమానాలకు దారి తీసింది.ఈ విషయమై పోలీసులు సేల్స్ మెన్ తో పాటు పలువురిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో నిందితులు  అసలు విషయాన్ని ఒప్పుకొన్నారు.  

ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా బంజారాహిల్స్ పోలీసులు ప్రకటించారు. నిందితుల నుండి కోటి రూపాయాల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios